Musi: మూసీలో లేడీ డెడ్‌ బాడీ..4 రోజుల క్రితం హుస్సేన్ సాగర్‌ నాలాలో గల్లంతైన లక్ష్మి!

ఈ నెల 3న డీఎస్‌నగర్‌ నాలాలో కొట్టుకుపోయిన లక్ష్మి మృతదేహం మూసీలో కనిపించింది. మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గర లక్ష్మి డెడ్‌బాడీ లభ్యమైంది. మరోవైపు డీఎస్ నగర్ నాలా ఒడ్డున మారియట్ హోటల్ నుంచి ప్రారంభమై నాగోల్ మీదుగా నల్గొండ జిల్లాలో 23కు పైగా ఇళ్లు ఉన్నాయని డీఆర్‌ఎఫ్ వర్గాలు తెలిపాయి. డ్రెయిన్‌ మూడు మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ప్రహరీ గోడ లేదు. ఇక నిన్న ప్రగతినగర్‌ ఎన్‌ఆర్‌ఐ(NRI) కాలనీ నాలాలో పడి.. నాలుగేళ్ల మిథున్ అనే బాలుడి చనిపోయాడు.

Musi: మూసీలో లేడీ డెడ్‌ బాడీ..4 రోజుల క్రితం హుస్సేన్ సాగర్‌ నాలాలో గల్లంతైన లక్ష్మి!
New Update

Hyderabad nala death: హైదరాబాద్‌లో నాలాలు దడ పుట్టిస్తున్నాయి. ప్రగతినగర్‌(pragati nagar)లో నాలుగేళ్ల బాలుడి మృతి ఘటన మరువక ముందే తాజాగా మూసీ(musi)లో ఓ మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. మూసారాంబాగ్‌ బ్రిడ్జి(moosarambagh bridge) దగ్గర మహిళ డెడ్‌బాడీ లభ్యమైంది. జీహెచ్‌ఎంసీ(GHMC) అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ డేడ్‌బాడీ నాలుగు రోజుల క్రితం హుస్సేన్ సాగర్‌ నాలాలో గల్లంతైన లక్ష్మిగా తెలుస్తోంది. నిన్ననే(సెప్టెంబర్ 5) ప్రగతినగర్‌ ఎన్‌ఆర్‌ఐ(NRI) కాలనీ నాలాలో పడి.. నాలుగేళ్ల మిథున్ అనే బాలుడి చనిపోయాడు. వరుస నాలా ప్రమాదాలతో జనాల్లో ఆందోళన నెలకొంది. ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక భయం భయంగా గడుపుతున్నారు.

ప్రహరీ గోడ లేదు..:
సెప్టెంబర్ 3న డీఎస్ నగర్ నాలాలో 56ఏళ్ల లక్ష్మి కనిపించకుండాపోయారు. డీఆర్ఎఫ్, గాంధీనగర్ పోలీసు బృందాలు డీఎస్‌నగర్ నుంచి నాగోల్ వరకు డ్రోన్ కెమెరాలతో మహిళ కోసం వెతికాయి. సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు లక్ష్మి అనే మహిళ బ్యాగ్‌తో ఇంట్లోకి వెళుతుండగా బయటకు రాకపోవడంతో నాలాలో కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న దుకాణంలో మధ్యాహ్నం 1.40 గంటలకు రెండు కిలోల బియ్యాన్ని కొని కుక్కర్‌లో పెట్టిందని, ఆ క్రమంలో వంటగది వెనుక తలుపు నుంచి నాలాలో పడిపోయిందని లక్ష్మి కుటుంబీకులు కూడా చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం 1.35 గంటలకు అమ్మ తనకు ఫోన్ చేసిందని.. ఆ సమయంలో తాను ఆఫీస్‌లో ఉన్నట్టు లక్ష్మి కుమార్తే సుకన్య చెప్పారు. మధ్యాహ్నం 2.20 గంటలకు ఇంటికి చేరుకున్నానని.. వంటగది వెనుక తలుపు తెరిచి ఉండటాన్ని గమనించానన్నారు. అప్పటికే పొయ్యిపై ఉన్న అన్నం మాడిపోయి ఉంది. తన తల్లి సుకన్య కనపడకుండా పోయిందని సుకన్య కన్నీరుమున్నీరయ్యారు.

ఈ విషయాన్ని గాంధీనగర్ పోలీసులకు చెప్పారు లక్ష్మి కుటుంబసభ్యులు. పోలీసులు డీఆర్‌ఎఫ్‌(DRF) బృందాలతో లక్ష్మి ఇంటికి చేరుకున్నాయి. అప్పటి నుంచి లక్ష్మి కోసం అంతా కలిసి వెతుకుతున్నారు. తాజాగా మూసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద లక్ష్మి మృతదేహం కనిపించింది. మరోవైపు డీఎస్ నగర్ నాలా ఒడ్డున మారియట్ హోటల్ నుంచి ప్రారంభమై నాగోల్ మీదుగా నల్గొండ జిల్లాలో 23కు పైగా ఇళ్లు ఉన్నాయని డీఆర్‌ఎఫ్ వర్గాలు తెలిపాయి. డ్రెయిన్‌ మూడు మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ప్రహరీ గోడ లేకపోవడంతో ఇక్కడ నివసిస్తున్న 30 కుటుంబాల వర్షాకాలంలో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని వాసులు వాపోతున్నారు.

నిన్న నాలాలో..:
నాలాలో కొట్టుకుపోయిన మిథున్ ప్రగతినగర్‌లోని ఎన్నారై కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇంటి దగ్గర ఆడుకుంటుండగా నాలాలో పడిపోయాడు. బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాలతో కలిసి మృతదేహాన్ని వెలికితీశారు.

ALSO READ: హైదరాబాద్‌లో విషాదం.. నాలాలోపడి చిన్నారి మృతి

#hyderabad-nala-deaths
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe