Abdullahpurmet Bike Incident : హైదరాబాద్-విజయవాడ హైవేపై హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ దగ్గర బైక్‌ను DCM వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండేళ్ల కొడుకు తన కన్న తండ్రిని కళ్ల ముందే కోల్పోయాడు. తండ్రి చనిపోయిన విషయం తెలియని ఆ బాలుడు.. డాడీ.. లే..డాడీ.. అంటూ డెడ్‌బాడీ పక్కనే ఏడుస్తూ కూర్చున్నాడు.
Also Read: ప్లీజ్.. ఈ విషయంపై రియాక్ట్ కావొద్దు.. నాగబాబు స్పెషల్ వీడియో..!
పాల ప్యాకెట్ కోసం కుమారుడితో బైక్‌పై వెళుతుండగా ఈ దారుణం జరిగింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. బాబుకు సైతం గాయాలవడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంకు చేరుకన్న పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు.
Also Read: ప్రియుడి టార్చర్.. రోడ్డుపైనే పలుసార్లు ఇలా వేధించేవాడు..!