కారును ఓవర్ టేక్ చేసినందుకు అంబులెన్స్ డ్రైవర్ పై దాడి!

బెంగళూరు నేలమంగల టోల్ ప్లాజా వద్ద అంబులెన్స్ డ్రైవర్ పై దుండగులు దాడి చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది.కారును ఓవర్ టెక్ చేసి వెళ్ళాడని నెపంతో డ్రైవర్ పై వారు దాడికి పాల్పడ్డారు. అంబులెన్స్ లో 5 నెలల బాలుడిని ఎమర్జెన్సీ గా తీసుకువెళ్తున్నట్టు తెలిపిన వారు కనికరించలేదు.

New Update
కారును ఓవర్ టేక్ చేసినందుకు అంబులెన్స్ డ్రైవర్ పై దాడి!

ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఓ ఐదు నెలల పసి పాపను ఆక్సిజన్‌ సపోర్ట్‌ తో బెంగళూరులోని వాణి విలాస్ అనే ఆసుపత్రికి అంబులెన్స్‌‌లో తరలిస్తున్నారు. చిన్నారిని సకాలంలో చేర్చాల్సి ఉన్న నేపథ్యంలో.. డ్రైవర్ జాన్.. అంబులెన్స్‌ను రోడ్డుపై వేగంగా తీసుకువెళ్లాడు. బెంగళూరు-తమకూరులోని నేల మంగల టోల్ ఫ్లాజా వద్ద అంబులెన్స్.. ఇన్నోవా కారును ఓవర్ టేక్ చేసింది. తమ వాహనాన్ని కారు ఓవర్ టేక్ చేయడంతో తట్టుకోలేక పోయిన ఇన్నోవా కారులోని వ్యక్తులు.. సుమారు ఆరు కిలోమీటర్ల వరకు అంబులెన్స్‌‌ను అనుసరించారు. అంబులెన్స్‌‌ను ఓవర్‌ టేక్‌ చేసి అడ్డుకున్నారు. అంబులెన్స్‌ డ్రైవర్‌‌ను తీవ్రంగా కొట్టారు. తమ పాప పరిస్థితి సీరియస్‌గా ఉందని, అతడ్ని వదిలేయాని పాప తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకున్నా వదల్లేదు. పోలీసుల జోక్యంతో అతడ్ని విడిచిపెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అంబులెన్సు డ్రైవర్ తమని… pic.twitter.com/cJjxv372Hg

— Telugu Scribe (@TeluguScribe) June 11, 2024

Advertisment
Advertisment
తాజా కథనాలు