AP: ఇసుక కోసం బారులు.. పని చేయని ఆన్‌లైన్‌ ప్రక్రియ..!

ఏపీలో పలు చోట్ల ఇసుక కోసం జనాలు బారులు తీరారు. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌ ప్రక్రియ పనిచేయకపోవడంతో స్టాక్ పాయింట్‌ దగ్గర కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. దీంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. ఒకే క్యూఆర్‌ కోడ్ ఉండటం వల్ల సంకేతిక సమస్య వచ్చినట్లు అధికారులు తెలిపారు.

New Update
AP: ఇసుక కోసం బారులు.. పని చేయని ఆన్‌లైన్‌ ప్రక్రియ..!

AP Free Sand Policy: ఆంద్రప్రదేశ్‌లో ఉచిత ఇసుక పథకం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. పాత ఇసుక విధానాన్ని రద్దు చేసిన టీడీపీ సర్కార్ (TDP Govt) ఉచిత ఇసుక పాలసీపై కొత్త జీవోను విడుదల చేసింది. దీంతో ఏపీలో పలు చోట్ల ఇసుక కోసం జనాలు బారులు తీరారు. మరికొన్ని చోట్ల ఆన్‌లైన్‌ ప్రక్రియ పని చేయని పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: డయేరియా కలకలం.. ఇద్దరు మానసిక దివ్యాంగులు మృతి..!

ఎన్టీఆర్‌ జిల్లా కీసర దగ్గర వాహనాలు బారులు తీరాయి. స్టాక్ పాయింట్‌ దగ్గర కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి.  ట్రాఫిక్‌ కారణంగా ట్రాక్టర్‌ డ్రైవర్లు, ఓనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా మాత్రమే ఇసుక అమ్మకం ఉండడంతో ఇసుక రవాణా నిలిచిపోయింది. ఒకే క్యూఆర్‌ కోడ్ ఉండటం వల్లే సంకేతిక సమస్య వచ్చిందంటున్నారు అధికారులు.

Also Read: దారుణం.. ప్రిన్సిపాల్‌ను కత్తితో కిరాతకంగా హత్య చేసిన విద్యార్థి..!

చివరకు అధికారులు అకౌంటు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి 3 స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి నగదు చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు జిల్లా లింగాయపాలెం ఇసుక రీచ్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఆధార్‌పై ఒక్క రోజులో 20 టన్నులకు మాత్రమే పరిమితి విధించారు.

Advertisment
తాజా కథనాలు