Relationship: లవర్‌తో గొడవలా? ఇలా చేయండి.. వెంటనే కలిసిపోతారు..!

లవర్స్‌ మధ్య గొడవలు అయితే కొన్ని టిప్స్‌తో సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. ఓపెన్ కమ్యూనికేషన్, ప్రశాంతంగా ఉండడం, కాంప్రమైజ్‌ అవ్వడం లాంటి వాటితో గొడవకు ఫుల్‌స్టాప్‌ పెట్టవచ్చు.

New Update
Relationship: లవర్‌తో గొడవలా? ఇలా చేయండి.. వెంటనే కలిసిపోతారు..!

ఏ రిలెషన్‌షిప్‌లోనైనా గొడవలు మాములే.. మనస్పర్థలు లేని లవ్‌ ఉండదు. అటు భార్యాభర్తలు మధ్య ఏదో ఒక ఇష్యూస్‌ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఫ్రెండ్స్‌ కూడా అప్పుడప్పుడు ఏదో ఒకటి తిట్టుకుంటారు. కొంతమంది వెంటనే కలిసిపోతారు. మరికొంతమంది మాత్రం అసలు కలవరు. ఈగోలకు పోతారు. ఇటు లవర్స్‌లో కూడా ఇద్దరిలో ఒకరికి ఈగో సమస్య ఉంటే పర్లేదు కానీ.. ఇద్దరూ ఈ విషయంలో ఒకే లాగా ఉంటే గొడవలు పెరుగుతాయి కానీ తగ్గవు. రిలేషన్‌షిప్‌ కంటీన్యూ అవ్వాలని కోరుకుంటే మాత్రం ఇష్యూస్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టి మూవ్‌ అన్‌ అవ్వాలని గుర్తు పెట్టుకోండి. లవర్‌ లేదా లైఫ్‌ పార్టనెర్‌తో గొడవలను సాల్వ్ చేసుకోవడానికి ఈ టిప్స్‌ తెలుసుకోండి.

ఓపెన్ కమ్యూనికేషన్: సమస్య గురించి ముందుగా అవతలి వ్యక్తితో నిజాయితీగా మాట్లాడండి. వాళ్లు చెప్పేదాన్ని క్లియర్‌గా వినండి. తర్వాత రియాక్ట్ అవ్వండి. అవతలి వ్యక్తిలో తప్పు ఉందా మనలో తప్పు ఉందా అని ఒక డిసిషన్‌కు రండి. అయితే అవతలి వ్యక్తిని నిందించకండి. మేటర్‌ను కూల్‌గా మాట్లాడి సాల్వ్ చేయండి.

ప్రశాంతంగా ఉండండి: కోపంగా ఉండవద్దు. సంభాషణ సమయంలో ప్రశాంతంగా ఉండాలి. కంపోజ్‌గా ఉండాలి. సమస్య గురించి మాట్లాడే సమయంలో కోపంగా ఉంటే గొడవ పెరుగుతుంది.మన కోపమే మన శత్రువు అని గుర్తుపెట్టుకోండి.

publive-image ప్రతీకాత్మక చిత్రం

అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి సైడ్‌ నుంచి విషయాలను గమనించండి. అప్పుడు వాళ్లు ఎందుకు ఇలా చేసి ఉంటారో మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది.

ఘర్షణకు కారణమయ్యే సమస్యను స్పష్టంగా తెలుసుకోండి. గొడవకు మూలాలను తెలుసుకోండి. అప్పుడే ప్రాబ్లెమ్‌ను ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది.

రాజీ కోసం చూడండి. రిలేషన్‌షిప్‌లో కాంప్రమైజ్‌ అవ్వడం అన్నిటికంటే బెస్ట్ థింగ్‌. కాంప్రమైజ్‌ అయితే సమస్య దాదాపు సాల్వ్ ఐనట్లే.

బ్రెయిన్‌స్టార్మ్ సొల్యూషన్స్: కలిసి, సమస్యకు సాధ్యమైన పరిష్కారాలను కనుగొనండి. కొత్త ఆలోచనలకు ఓపెన్‌గా ఉండండి. రాజీకి సిద్ధంగా ఉండండి.

ఉత్తమ పరిష్కారాన్ని ఎంచుకోండి. మీ సొలూష్యన్‌ అత్యంత న్యాయమైనదిగా ఉండాలి. ఇతరులవేలు పెట్టి చూపించేదిగా ఉండకూడదు.

సరిహద్దులను సెట్ చేయండి: భవిష్యత్తులో ఇలాంటి వైరుధ్యాలను నివారించడానికి స్పష్టమైన సరిహద్దులు సెట్ చేసుకోండి.

క్షమించండి: గొడవ గురించి కంక్లూషన్‌కు వచ్చిన తర్వాత అవతలి వ్యక్తిని క్షమించండి. పగలు, ప్రతీకారాలు ప్రేమలో వద్దు. నిజానికి క్షమించడానికి మించిన మంచి గుణం ఇంకోటి ఉండదు. పంతాలతో సాధించేదేమి ఉండదు. మనకే హ్యాపీనేస్‌ పోతుంది.

Also Read: నైట్‌ స్నానం చేయకుండా నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు