Vastu Tips: దేవునికి దీపం వెలిగించాలంటే ఈ నియామాలు పాటించాలి! పూజలు చేసేటపుడు దేవుని ముందు దీపం వెలిగించడం ఆనవాయితీ. అయితే, ఈ దీపం వెలిగించడం ఎలా పడితే అలా చేయకూడదని పండితులు చెబుతారు. దీపం వెలిగించడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. తొలిఏకాదశి సందర్భంగా దీపం వెలిగించడానికి ఉన్న నియమాలు ఏమిటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు By KVD Varma 17 Jul 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Vastu Tips: హిందూ మతంలో పూజలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దీపం, ధూపం, పసుపు, కుంకుమ, పువ్వులు మరియు నైవేద్యాలను పూజలో దేవుడికి సమర్పిస్తారు. కానీ జ్యోతిష్యం - వాస్తు శాస్త్రంలో కూడా దీపం వెలిగించడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఏదైనా పూజ లేదా శుభ కార్యాన్ని ప్రారంభించే ముందు ఒక దీపం వెలిగించడం సంప్రదాయం. దీపం వెలిగించడం ద్వారా నిబంధనల ప్రకారమే పూజలు ప్రారంభిస్తున్నామని చెప్పడం అంటారు. అయితే దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. Vastu Tips: వివిధ పురాణాల్లో.. వాస్తు శాస్త్ర విధానాల్లో ఈ నియమాలను వివరించారు. దీపం వెలిగించడం కోసం ఈ నియమాలనుఁ పాటించడం అవసరం అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అయితే, దీపం వెలిగించడం కోసం ఎటువంటి నియమాలు పాటించాలో చెప్పే ముఖ్యమైన ఈ నియమాలను పాటించడం వల్ల కోరికలు నెరవేరతాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. దీపం నియమబద్ధంగా వెలిగిస్తే చేసే పూజ కూడా నిర్విఘ్నంగా సాగిపోతుందనీ.. ఆ పూజ ఇందుకోసం చేస్తున్నామో ఆ సంకల్పం నెరవేరుతుందనీ ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. మరి దీపం వెలిగించడానికి ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. దీపం వెలిగించే సమయంలో, వత్తి ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. పూజ సమయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టకరం. దీపాన్ని ఎప్పుడూ తూర్పు ముఖంగా ఉంచడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఉత్తరం వైపు దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం పెరుగుతుంది. దీపం పడమర దిక్కున పెడితే జీవితంలో విఘాతం కలుగుతుంది. మానసిక ఆందోళన పెరుగుతుంది. దక్షిణ దిశలో దీపం పెట్టడం వల్ల హాని కలుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. జీవితం ఇబ్బందికరంగా క్లిష్టంగా మారుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం, పూజా స్థలం మధ్యలో దేవత విగ్రహం లేదా ఫోటో ముందు దీపం వెలిగించాలి. నూనెతో దీపం వెలిగిస్తే రెడ్ కాటన్ విక్స్ వాడితే మంచిది. ఇంట్లో ప్రతిరోజూ పూజా గదిలో దీపం వెలిగిస్తే దూదిని ఉపయోగించడం ప్రయోజనకరంగా చెబుతారు. Also Read: 46 ఏళ్ల తర్వాత జగన్నాథ ఆలయ ఖజానా ఎందుకు తెరుచుకుంది? (గమనిక: ఈ కథనం సాంప్రదాయ, ప్రసిద్ధ నమ్మకాలపై ఆధారపడింది. ఇది కేవలం పాఠకుల కోసం ఇస్తున్న సమాచారం మాత్రమే. ఈ వార్తలో ఉన్న సమాచారం - వాస్తవాల కచ్చితత్వానికి RTV బాధ్యత వహించదు) #vastu-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి