Online Cakes: కేక్ చెడిపోయిందని ఎలా గుర్తించాలి.. ఆన్లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి..? గత వారం పంజాబ్‌లోని పాటియాలాలో కేక్ తిని ఓ బాలిక మృతి చెందిన ఘటన గురించి అందరు వినే ఉంటారు. అయితే మనలో కూడా చాలా మంది పుట్టినరోజు కోసం ఆన్లైన్ లో కేక్స్ ఆర్డర్ చేస్తుంటారు. ఆ కేక్ ఫ్రెష్ గా ఉందా? లేదా తెలుసుకోవడానికి ఇవి సంకేతాలు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 10 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Online Cakes: గత వారం పంజాబ్‌లోని పాటియాలాలో కేక్ తిని ఓ బాలిక మృతి చెందింది. దీంతో పాటు కుటుంబంలో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. చిన్నారి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లో కేక్‌ను ఆర్డర్ చేశారు. కానీ అది పాడైన కేక్ కావడంతో బాలిక మృతికి కారణమైంది. అయితే దీని పై పోలీసులు విచారణ చేయగా.. ఆ బేకరీలో సరైన ఉష్ణోగ్రత వద్ద కేక్ నిల్వ చేయలేదని తేలింది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఆ బేకరీపై ఆరోగ్య శాఖ చలాన్ జారీ చేయడంతో పాటు బేకరీ ఉద్యోగులను అరెస్టు చేశారు పోలీసులు. ఇలాంటి హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకోవడం ఎంతో మంది మనసుల్ని కలచివేసింది. అయితే మనలో కూడా చాలా మంది పుట్టినరోజు కోసం ఆన్లైన్ లో కేక్స్ ఆర్డర్ చేసుకుంటాము. ఇలా ఆర్డర్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. కేక్ ఫ్రెష్ గా ఉందా..? లేదా చెడిపోయిందా అని తెలుసుకోవడానికి ఈ సూచనలు ఫాలో అవ్వండి .. కేక్ ప్యాకేజింగ్ ఆన్లైన్ ఏదైనా వస్తువు లేదా ఆహార పదార్థాలు కొనేటప్పుడు వాటి ప్యాకింగ్ చెక్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కేక్ సరిగ్గా సీల్ చేయకపోయినా .. తారుమారుగా ఉన్నట్లు కనిపించిన అది తాజాగా ఉండకపోవచ్చని సూచన. పొడిగా కనిపించడం సహజంగా నాణ్యమైన కేక్స్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తాయి. అలా కాకుండా కేక్ పొడిగా, బూజుపట్టినట్లు, క్రాక్స్ పడినట్లు కనిపించడం పేలవమైన నాణ్యతకు(poor quality) సంకేతం. అలాంటి వాటిని తినకపోవడం మంచిది. ఆకృతి (texture) చెడిపోయిన కేక్ ఎక్కువ తడిగా లేదా జిగటగా ఉంటుంది. పట్టుకోగానే సులభంగా విరిగిపోతుంది. అంతే కాదు దాని రుచి కూడా కాస్త పుల్లగా, సాధారణ దానితో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. వాసన సాధారణంగా ఫ్రెష్ ఉన్న కేకులు ఆ ఫ్లేవర్ కు సంబంధించిన వాసనను కలిగి ఉంటాయి. ఒక వేళ కేక్ చెడిపోయినట్లైతే పుల్లటి వాసన వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఆ కేక్ చెడిపోయిందని స్పష్టంగా తెలుస్తుంది. రివ్యూస్ ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేసే ముందు ఫస్ట్ చేయాల్సిన పని రివ్యూస్ చదవడం. మీరు ఆర్డర్ చేయాలనుకునే బేకరీ లేదా ఆ అవుట్ లెట్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. గతంలో ఆ అవుట్ లెట్ కు సంబంధించిన రివ్యూస్ చెక్ చేయడం.. అలాగే దాని నాణ్యత పై కూడా శ్రద్ధ వహించాలి. కేక్స్ వంటి చెడిపోయిన ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ద్వారా బ్యాక్టీరియా వృద్ధి చెంది.. ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు వికారం, వాంతులు, అతిసారం, కడుపు నొప్పి, జ్వరం, నిర్జలీకరణం, అవయవాలు దెబ్బతినడం. మీకు అలెర్జీ ఉన్నట్లయితే, గింజలు, డైరీ లేదా గుడ్లు వంటి వాటితో చేసిన కేక్‌లను తినడం వల్ల అలర్జీస్ వస్తాయి. దీని లక్షణాలు వాపు, దురద మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. చెడిపోయిన కేక్ రుచి, రంగు, వాసన మారుతుంది. దీన్ని తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు వస్తాయి. చాలా సందర్భాలలో ఇది ప్రాణాంతకంగా కూడా కావచ్చు. పాడైపోయిన కేకులు బూజు పట్టి ఉంటాయి , వాటిని తినడం ద్వారా శరీరం చెడు రసాయనాలతో కలుస్తుంది, ఇది ఆరోగ్యాన్ని మరింతదెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. Also Read: Bone Cancer: బోన్ క్యాన్సర్ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? #online-cakes మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి