క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ జీవితాన్ని నాశనం చేసుకునేవారు ఎందరో ఉన్నారు. ఏ ఇబ్బంది ఎదురైనప్పటికీ ఆత్మహత్య దానికి పరిష్కారం కాబోదు. కొంతమంది మరీ చిన్న చిన్న కారణాలకే బలవంతంగా తనువు చాలిస్తున్నారు. మానసిక వైద్యులు చెబుతున్నదాని ప్రకారం చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్య అనేది ఎప్పటికీ పరిష్కారం కాబోదని, మానసిక ఒత్తిడి నుంచి బయట పడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఆహారం కూడా ఎంతో ఉపయోగపడుతుంది. బలమైన ఆహారం తీసుకోవడంవల్ల మెదడు చురుగ్గా మారుతుంది. దీనివల్ల చెడు ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు రావు. శరీరం మొత్తం యాక్టివ్ అవుతుంది. అందుకే విటమిన్లు, మినరల్స్ వంటి మంచి పోషకాలుండే ఆహారం తీసుకోవాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు
కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా పదే పదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతుంటారు. ఒక్కోసారి అధిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. ఖాళీ లేకుండా పనులు చేస్తూ ఉంటే ఒత్తిడికి దూరంగా ఉండొచ్చు. పని చేసేటప్పుడు మధ్య మధ్యలో కాస్తంత విరామం తీసుకుంటుండాలి.ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలను చూడటం, వినడంకానీ చేయవద్దు. ప్రతి చిన్న విషయాన్ని అదేపనిగా ఆలోచించడంవల్ల మానసికంగా కుంగిపోతాము. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒత్తిడి పెరిగితే దాంతోపాటు రోగాలు కూడా పెరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అవకాశమున్నప్పుడల్లా స్నేహితులతో కలుస్తు ఉండాలి. సమస్యలేమైనా ఉంటే వారితో పంచుకుంటే కొంత ఒత్తిడి తగ్గుతుంది. కొందరు రోజుకు 4 నుంచి 5 గంటలే నిద్రిస్తుంటారు. కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు.విశ్రాంతి లేకుండా పనులు చేయొద్దు. కొంతమంది అదే పనిగా పనిచేస్తుంటారు. దీనివల్ల నిద్రకు దూరమవుతారు. నిద్ర లేకపోతే అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమయానికి భోజనం చేయడంతోపాటు సమయానికి నిద్ర పోవడం కూడా చేస్తే ఒత్తిడిని జయించవచ్చు.