Parenting Tips: కోపంలో పిల్లల పై అరుస్తున్నారు.. అయితే చాలా ప్రమాదం..!

కొన్ని సార్లు తల్లిదండ్రులు ఏదో టెన్షన్ లేదా ఒత్తిడిలో ఉండడంతో వారి ఓపికను కోల్పోయి.. పిల్లలు తెలియక చేసిన తప్పులకు వారి పై కోప్పడడం లేదా అరవడం వంటివి చేస్తారు. అది పిల్లల మానసిక పరిస్థితి పై ప్రభావం చూపుతుంది. అలా కాకుండా ప్రేమగా చెప్పే ప్రయత్నం చేయండి.

New Update
Parenting Tips: కోపంలో పిల్లల పై అరుస్తున్నారు.. అయితే చాలా ప్రమాదం..!

Parenting Tips: కొన్ని సార్లు తల్లిదండ్రులు పిల్లలు తెలిసి.. తెలియక చేసిన తప్పులకు వారి పై కోపడడం లేదా పిల్లల పై అరవడం వంటివి చేస్తారు. దీనికి కారణం వాళ్ళు ఏదైనా టెన్షన్ లో లేదా ఒత్తిడిలో ఉండొచ్చు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లల  మానసిక పరిస్థితి పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకని కోపం వచ్చినప్పుడు పిల్లల పై అరవకుండా.. కోపాన్ని కంట్రోల్ చేసుకొని వారికి సరైన పద్దతిలో చెప్పడానికి  ప్రయత్నించండి.

మీ కోపాన్ని ఈ విధంగా కంట్రోల్ చేసుకోండి..

ప్రేమతో చెప్పడానికి ప్రయత్నించండి

చిన్నతనంలో తెలియక పిల్లలు కొన్ని తప్పుకోపాన్ని లు చేస్తారు. దాని వల్ల తల్లిదండ్రులు వారి పైకోప్పడుతుంటారు. పిల్లలు తప్పు చేసినప్పుడు కోపంతో కాకుండా ప్రేమతో వాళ్ళను దగ్గరకు పిలిచి ఆ తప్పును సరి చేయడానికి ప్రయత్నించాలి. అలా చేయడం వల్ల వారిలో మీ పై మరింత ప్రేమ పెరుగుతుంది. అంతే కాదు మరొకసారి చేయకుండా ఉంటారు. అలా కాకుండా వారి పై అరవడం వల్ల అది వాళ్ళ మానసిక పరిస్థితి పై ప్రభావం చూపుతుంది.

పిల్లల వైపు నుంచి ఆలోచించండి 

పిల్లలు తప్పు చేసినప్పుడు ముందే కోప్పడకుండా వారి వైపు నుంచి ఆలోచించడానికి ప్రయత్నించండి. అసలు పిల్లలు ఆ తప్పు ఎందుకు చేశారు.. చేయడానికి కారణమేంటని  ఆలోచించడం వల్ల మీకు వారి ఆలోచన విధానం పై  మరింత అవగాహన కలిగి..  పిల్లలు మరోసారి ఆ తప్పు చేయకుండా చూసుకునే అవకాశం ఉంటుంది.

పిల్లలను పై చెయ్యి చేసుకోకూడదు

కొన్ని సార్లు తల్లిదండ్రులు ఏదో టెన్షన్, ఒత్తిడిలో ఉండడంతో వారి ఓపికను కోల్పోయి.. పిల్లలు తప్పు చేయగానే  వారి పై చెయ్యి చేసుకుంటారు. అలా చేయడం వల్ల  పిల్లలు నిరాశ చెందే అవకాశం ఉంటుంది. ఒకవేళ పొరపాటున అలా చేసినా.. మళ్ళీ పిల్లలను దగ్గరకు తీసుకొని ప్రేమగా వారికి క్షమాపణ చెప్పండి. దాని వల్ల పిల్లలో కూడా ఒక పాజిటివ్ థింకింగ్ ఏర్పడుతుంది.

తప్పు, ఒప్పులను చెప్పండి

పిల్లలు తప్పు చేసినప్పుడు వారి పై అరిచే బదులు వాళ్ళు చేసిన తప్పు, ఒప్పులను చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే పిల్లలకు తప్పు, ఒప్పుకు మధ్య ఉన్న తేడాను వివరించండి. దాని వాళ్ళ మరొకసారి వాళ్ళు ఆ తప్పును చేయరు.

Advertisment
Advertisment
తాజా కథనాలు