Pan card: మీ పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందా? ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి. మరి ఇంత ముఖ్యమైన పాన్ కార్డు దుర్వినియోగమైతే పరిస్థితి ఏమిటి? మీ పాన్ కార్డ్ రికార్డులను ఎలా చెక్ చేసుకోవాలి? మోసం జరిగితే, దాని గురించి ఎలా రిపోర్ట్ చేయాలి? అనే వాటిపై ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 03 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి నేటి కాలంలో మనం చేసే ఆర్థిక లావాదేవీలు అన్నింటికీ పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అయితే ఈ పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయి. సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో పాన్ కార్డు దుర్వినియోగం సహజమే. అందుకే మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందో, లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరి. PAN కార్డ్ అనేది భారత ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ఒక ప్రత్యేకమైన 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ ఐడెంటిఫైయర్. దీనిని లామినేటెడ్ కార్డ్ రూపంలో ఐటీ డిపార్ట్మెంట్ జారీ చేస్తుంది. పన్ను ప్రయోజనాల కోసం భారతదేశంలోని వ్యక్తులు, సంస్థలకు PAN కార్డ్ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పనిచేస్తుంది. అయితే కొన్ని కీలకమైన పనుల కోసం పాన్ కార్డు జిరాక్సు కాపీలను ఇవాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మీ పాన్ కార్డు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీ పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పాన్ కార్డు దుర్వినియోగం అవుతుందో లేదో తెలుసుకోవాలంటే, మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖాతాలను తరచుగా చెక్ చేసుకోవాలి. బ్యాంక్ స్టేట్మెంట్లను, రసీదులను పరిశీలించాలి. ఏవైనా తప్పుడు లావీదేవీలు జరిగాయా, లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకా ఏమేమి పరిశీలించాలంటే? ఫైనాన్సియల్ స్టేట్మెంట్స్ : మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు చూడాలి. వాటిలో ఏవైనా అనుమానాస్పద లేదా అనధికార ఆర్థిక లావాదేవీలు జరిగాయా, లేదా అనేది ఓసారి చెక్ చేసుకోవాలి. సిబిల్ : క్రెడిట్ బ్యూరోల నుంచి మీ క్రెడిట్ రిపోర్టు కాపీని తీసుకోండి. మీ పాన్ కార్డ్‌తో అనుసంధానం అయిన ఏవైనా ఫేక్ అకౌంట్స్ లేదా క్రెడిట్ అప్లికేషన్‌లు ఉన్నాయా లేదా అనేది చూడండి. ఒకవేళ అలాంటి ఏమైనా ఉంటే, వెంటనే క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయండి. ఐటీ రిపోర్టు : ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ పాన్ కార్డ్ వివరాలను ఉపయోగించి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వండి. మీ పన్ను ఫైలింగ్‌లను చెక్ చేయండి. ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా లేదా చూసుకోండి. ఉదాహరణకు, మీరు ఫారమ్ 26ASలో వివరాలను తెలుసుకోవచ్చు. మీ బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు : మీరు ఏదైనా మోసపూరిత లేదా అనుమానాస్పద లావాదేవీలను గమనించినట్లయితే, వెంటనే మీ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థకు ఫిర్యాదు చేయండి. వారు అనధికారిక యాక్సెస్‌ను బ్లాక్ చేసి, మీ ఖాతాలను సంరక్షిస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేయండి : మోసపూరిత ఆర్థిక లావాదేవీలు, గుర్తింపు చౌర్యం లేదా అనధికారిక యాక్సెస్ వంటి పాన్ కార్డ్ దుర్వినియోగాన్ని గుర్తిస్తే, వెంటనే మీ దగ్గరల్లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. వారికి పాన్ కార్డ్ ఫ్రాడ్‌కు సంబంధించిన అన్ని వివరాలు, పత్రాలు అందజేయండి. ఆదాయపు పన్ను శాఖను సంప్రదించండి : ఆదాయపు పన్ను శాఖ కస్టమర్ సర్వీస్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి. మీ పాన్ కార్డు దుర్వినియోగానికి సంబంధించిన వివరాలు, ఆధార పత్రాలు అందించండి. #pan-card మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి