Bedroom Aesthetics: ఇలా చేస్తే మీ బెడ్‌రూమ్ మరింత బ్యూటిఫుల్‌గా మారుతుంది.. ట్రై చేసి చూడండి ఇంట్లో అన్ని రూమ్స్ కంటే కూడా బెడ్ రూమ్ డిజైనింగ్ అనేది చాలా కష్టమైనది అలాగే ముఖ్యమైనది కూడా. ఎందుకంటే మనం బయట అలసిపోయి వచ్చాక ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునేది బెడ్ రూమ్ లోనే అందుకని బెడ్ రూమ్ సంబందించిన లైటింగ్, ఇంటీరియర్ డిజైన్స్ విషయంలో చాలా శ్రమ తీసుకుంటుంటారు కానీ ఇప్పుడు మీకు ఆ శ్రమ లేకుండా మీ బెడ్ రూమ్ డిజైనింగ్ విషయంలో ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ రూమ్ అందగా కనిపించడంతో పాటు ప్రశాంతంగా ఉంటుంది. By Archana 20 Oct 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Bedroom Aesthetics: ఇళ్ళు అనేది అందరికి ఒక కళ. అలాంటి ఇంటిని అందగా ప్రశాంతంగా నిర్మించుకోవాలని కోరుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇళ్ళు కంటే కూడా ఇంటిలోని ఇంటీరియర్స్ పై ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు. ఇంట్లోని ప్రతి రూమ్ చాలా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఇంట్లో అన్నింటికన్నా ముఖ్యమైనది బెడ్ రూమ్ ఎందుకంటే బయట ఎంత సేపు ఉన్నా, సరే చివరికి వెళ్లి ప్రశాంతగా రిలాక్స్ అయ్యేది బెడ్ రూమ్ లోనే అందుకని బెడ్ రూమ్ చాలా అందంగా, మనసుకు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే దాని డిజైనింగ్ విషయంలో కూడా చాలా శ్రమ తీసుకుంటారు కానీ ఇప్పుడు ఆ శ్రమ అవసరం లేదు.. మీ బెడ్ రూమ్ అందంగా కనిపించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు లైట్ కలర్స్ ను ఎంచుకోండి బెడ్ రూమ్ కు వెళ్ళగానే ప్రశాంతమైన నిద్ర పట్టాలి. కాబట్టి మీ బెడ్ రూమ్ బ్రైట్ కలర్స్ కాకుండా కంటికి ప్రశాంతగా కనిపించే లైట్ కలర్స్ ను ఎంచుకోవాలి. ప్రకాశవంతమైన రంగులకు బదులు లైట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్, పింక్, లావెండర్ కలర్స్ వాడండి. మొక్కలను పెట్టండి బెడ్ రూమ్ మరింత ప్రశాంతంగా ఉండడానికి రూమ్ లో చిన్న చిన్న మొక్కలను పెట్టండి దాని వాళ్ళ రూమ్ ప్రశాంతంగా ఉండడంతో పాటు అందంగా కూడా కనిపిస్తుంది. ప్లాస్టిక్ మొక్కలు కాకుండా నిజమైన మొక్కలను మొక్కలను పెడితే అది రూమ్ కు పచ్చదనాన్ని జోడించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచింది. లైటింగ్ మన రూంలోని లైట్స్ మన మానసిక స్థితిని నిర్ణయించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే నిద్ర పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే లైటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పడుకునే సమయంలో బయట వెలుతురు లోపలి రాకుండా డార్క్ కర్టెన్స్ వాడండి. పడుకునే ముందు మంచి వాతావరణం కోసం బెడ్ లాంప్ వాడండి. సౌకర్యమైన బెడ్ బెడ్ రూమ్ అనగానే అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది బెడ్ అందుకని బెడ్ చాలా ఆకర్షణీయంగా ఉండాలి. దాంతో పాటు పడుకోవడానికి సౌకర్యంగా ఉండేలా ఎంచుకోండి. అలాగే బెడ్ సైజ్ డిసైడ్ చేసేటప్పుడు రూమ్ యొక్క సైజు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. బెడ్ పెద్దగా ఉంది రూమ్ చిన్నగా ఉంటే అది చూడడానికి ఆకర్షణీయంగా కనిపించదు. గోడల పై ఆర్ట్ వర్క్ మీ బెడ్ రూమ్ గోడలను అలాగే ప్లైన్ గా వదిలేయకుండా రూమ్ మరింత అందంగా కనిపించటానికి వాటి పై ఏదైనా డిజైన్ చేయించండి వాల్ పేపర్స్ తో డెకరేట్ చేయండి. Also Read: life Style: ఆఫీస్‌లో ఓవర్ టైమ్ చేస్తున్నారా? మీ చిట్టి గుండెకు ఏం అవుతుందో తెలిస్తే ఫ్యూజులు అవుటే..! #bedroom-planning #bed-room-aesthetics #bedroom-decore మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి