బీరు తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలో!

బీరును మితంగా తీసుకోవటం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాన్ని అందిస్తుంది.మానసిక ఒత్తిళ్ల నుంచి,ఎముకల ధృడత్వానికి,గుండె,డయాబెటిస్ జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.అయితే బీరును ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యపాలై అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

బీరు తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలో!
New Update

బీరు తాగడంవల్ల 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీరును మితంగా తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పానీయాల్లో బీరు కూడా ఒకటి. వేసవి కాలంలో అయితే బీరు వినియోగం తారస్థాయికి చేరుకోవడమేకాదు.. అమ్మకాలు ఊహించని సంఖ్యలో ఉంటాయి. బీర్ ను మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి ప్రయోజనాలున్నాయి.

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరును తక్కువ మొత్తంలో తీసుకోవడంవల్ల ఒత్తిడి తగ్గడంతోపాటు ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మెరుగైన ఆరోగ్య స్థితికి దోహదపడుతుంది. అయితే బీరును ఎక్కువగా తీసుకోవడంవల్ల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కేవలం ఒక గ్లాసు బీరు తీసుకుంటేనే ఆరోగ్య ప్రయోజనాలన్నీ అందుతాయి. బీరును ఎక్కువగా తాగితే హైబీపీ, ఊబకాయం, లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది: ఎముకల ఆరోగ్యానికి బీర్ మంచిది. బీర్ అనేది డైటరీ సిలికాన్ మూలం. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజం. మితంగా బీర్ తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరగడంతోపాటు ఎముకలు పలచబడటాన్ని నిరోధిస్తుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తక్కువ మొత్తంలో బీరు వినియోగం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ప్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉండటంతో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయని తేలింది. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మితంగా తీసుకోవడంవల్ల మధుహేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పలు అధ్యయాల్లో తేలింది. డయాబెటీస్ కేర్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, మితమైన బీర్ వినియోగం మధ్య వయస్కులు, వృద్దుల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది.

#benefits-of-drinking-beer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe