Kissing: ఒక ముద్దు.. ఎన్నో లాభాలు..! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

ముద్దు(Kiss) ప్రేమను వ్యక్తం చేసే ఒక పద్ధతి. ముద్దుతో లవర్స్‌ మధ్య శారీరక సాన్నిహిత్యం మాత్రమే కాదు ఎమోషనల్ కనెక్షన్‌కి కూడా పెంచుతుంది. మన ఇమ్యూన్‌ సిస్టమ్‌ని మెరుగుపరచడంలో కూడా కిస్‌ అన్నది కీలక పాత్ర పోషిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ముద్దు వల్ల ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌ల లాంటి ఫీల్‌ గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. అందుకే ఏ విధంగా చూసినా ముద్దు మన మంచికేనని లవ్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

New Update
Kissing: ఒక ముద్దు.. ఎన్నో లాభాలు..! ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..!

ప్రేమ(Love)ను ఒక ముద్దుతో వ్యక్తపరుచుకోవచ్చు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు, లవర్స్ ఒకరినొకరు, ఇక భార్యాభర్తలు ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేసుకోవడానికి ముద్దు ఒక మంచి అస్త్రం. ముద్దుతో అనేక లాభాలున్నాయి. అవి ఏంటో తెలుసుకోండి..

⦿ హార్మోన్ల విడుదల: ముద్దు వల్ల ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌ల లాంటి ఫీల్‌ గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి హ్యాపీనెస్‌ హార్మోన్లు. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

⦿ రిలాక్సేషన్: ముద్దు విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది.ఇది బీపీని కూడా తగ్గిస్తుంది. రక్తపోటు లెవల్స్‌ తగ్గితే ఆటోమెటిక్‌గా ఒత్తిడి కూడా తగ్గుతుంది

⦿ ఎమోషనల్ కనెక్షన్: ముద్దు ఎమోషన్‌కి సంబంధించింది. ముద్దుతో అటాచ్‌మెంట్ పెరుగుతుంది. చాలామంది తమ మొదటి ముద్దును చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆ టచ్‌కు భావోద్వేగ సాన్నిహిత్యం ఉంటుంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

⦿ బంధం: ముద్దులు వ్యక్తుల మధ్య బంధాలను బలోపేతం చేస్తాయి. భద్రతను పెంపొందించగలవు కూడా. ఆప్యాయతను పంచుకోవడానికి మీకు ఎవరైనా ఉన్నారని చెప్పేది ముద్దు.. ఒత్తిడి, ఒంటరితనం లాంటి భావాలను ముద్దు తగ్గిస్తుంది. రెగ్యూలర్‌గా కిస్‌ చేసుకోవడం వల్ల ఏ ఇద్దరి మధ్య అయినా హెల్తీ రిలేషన్‌షిప్‌ ఉంటుంది.

⦿ రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్: ప్రేమలో ఉన్నవాళ్లు ఎక్కువగా కిసెస్‌ పెట్టుకుంటారు. ఇది ఒక రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్‌. ఇది రిలేషన్‌షిప్‌ బెటర్‌ అవ్వడానికి ఎంతగానో సహాయిపడుతుంది.

⦿ శారీరక సాన్నిహిత్యం: ముద్దులో శారీరక సాన్నిహిత్యంతో పాటు స్వీట్ స్పర్శ ఉంటుంది. ఇది భాగస్వాముల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతుంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

⦿ ఫిజికల్‌ హెల్త్: మన ఇమ్యూన్‌ సిస్టమ్‌ని మెరుగుపరచడంలో కూడా కిస్‌ అన్నది కీలక పాత్ర పోషిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. మన ఓరల్‌ హైజీన్‌ని కూడా కిస్‌ బెటర్‌గా చేస్తుందట. ఓవరల్‌గా చూస్తే ముద్దు ఫిజికల్‌గా మానసికంగా మనిషికి ఎంతో మెరుగ్గా చేస్తుందని తెలుస్తోంది.

ముద్దు అనేది ఒత్తిడికి ఉపశమనం లాంటిది. అయితే.. అన్ని ఒత్తిళ్లను శారీరక ఆప్యాయత ద్వారా మాత్రమే పరిష్కరించలేమని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఒత్తిడికి మూలకారణాలను కనిపెట్టడం..వాటిని పరిష్కరించడం ముఖ్యం. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం వ్యాయామం, విశ్రాంతి చాలా అవసరం.

ALSO READ: వన్‌ సైడ్‌ లవ్‌లో ఉన్నారా? అయితే ఈ టిప్స్‌ పాటించండి.. ఏం అవుతుందో చూడండి!

Advertisment
తాజా కథనాలు