Lice: తలలో పేళ్ల బాధ ఎక్కువైందా.. అయితే ఇవి అప్లై చేయండి

కొంత మంది తలలో పేళ్ల సమస్యతో విసిగిపోతుంటారు. వీటిని తగ్గించడానికి ఇంట్లో ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి, ఉల్లిపాయ, కొబ్బరి నూనె, కరివేపాకు మిశ్రమాలు పేళ్ళను తగ్గిస్తాయి. వీటి తయారి విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి

New Update
Lice: తలలో పేళ్ల బాధ ఎక్కువైందా.. అయితే ఇవి అప్లై చేయండి

How To Get Rid of Lice: జట్టు ఒత్తుగా బారుగ ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ సరైన కేర్ తీసుకోకపోతే తలలో చుండ్రు, తలలో పేన్లు తయారయ్యే అవకాశం ఉంటుంది. కొంత మందిలో ఈ పేన్ల సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి వారు వీటితో చేసిన మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేస్తే దెబ్బకు తలలో పేన్లు మాయం అవుతాయి.

మిశ్రమాల తయారీ విధానం

వెల్లుల్లి మిశ్రమం 

వెల్లుల్లి ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసి దాంట్లో కాస్త నిమ్మరసం బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు అంతా పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి. జుట్టు ఎండిపోయిన తర్వాత దువ్వెనతో క్లీన్ చేస్తే పెన్లన్ని బయటకు వస్తాయి.

మయోనేస్

మీ జుట్టుకు సరిపడ మయోనేస్ తీసుకొని జుట్టుకు మొత్తం పట్టించాలి. ఇది పెట్టుకొని అరగంట సేపు హెడ్ క్యాప్ తో కవర్ చేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీళ్ళతో క్లీన్ చేయాలి.

బేకింగ్ సోడా 

బేకింగ్ సోడా తలలో పేన్లను దూరం చేయడానికి అద్భుతమైన చిట్కా. బేకింగ్ సోడాలో ఆలివ్ ఆయిల్ కలిపి.. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి రాత్రంతా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే శుభ్రంగా కడిగేసి దువ్వెనతో దువ్వుకోవాలి.

publive-image

వేపాకు మిశ్రమం 

వేపాకు మిశ్రమం పేన్ల సమస్యను తగ్గించడానికి ప్రభావంగా పని చేస్తుంది. వేపాకులు మెత్తగా గ్రైండ్ చేసి.. దీంట్లో పుల్లటి పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇది పేన్లను నివారించడానికి సహాయపడుతుంది.

ఉల్లిపాయ మిశ్రమం 

ఉల్లిపాయలను సన్నగా తరిగి వాటిని జ్యూస్ లా మిక్షి వేసుకోవాలి. ఈ రసాన్ని జుట్టుకు అప్లై చేస్తే దెబ్బకు పేన్లు మాయం అవుతాయి. ఉల్లిపాయలతో జుట్టు కూడా దృఢంగా ఉంటుంది.

కొబ్బరి నూనె 

కొబ్బరి నూనె కూడా పేన్లను తొలగించడానికి అద్భుతమైన చిట్కా. కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి జట్టుకు పెడితే తలలోని పేళ్ళ గుడ్లు చనిపోతాయి. ఇంకా దువ్వెనతో దువ్వితే పెన్లు కూడా బయటకు వస్తాయి.

Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు