పోలీసు స్టేషన్ ముందే హిటాచి యజమాని ఆత్మహత్యాయత్నం.!

అనంతపురం జిల్లా గుంతకల్లులో హిటాచి యజమాని రమేష్ రూరల్ పోలీసు స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నాడనే నెపంతో గనుల భూగర్భ శాఖ అధికారులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

New Update
పోలీసు స్టేషన్ ముందే హిటాచి యజమాని ఆత్మహత్యాయత్నం.!

Anantapur: గనుల భూగర్భ శాఖ అధికారుల వేధింపులు తాళలేక హిటాచి యజమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో సంచలనంగా మారింది. గుంతకల్లు పట్టణానికి చెందిన హిటాచి యజమాని రమేష్. అయితే, అతడు అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నాడనే నెపంతో పొలం వద్ద నిలిపి ఉన్న హిటాచీని అధికారులు రమేష్ కు తెలియకుండా గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న రమేష్ హుటాహుటిన స్టేషన్ కు పరుగులు తీశాడు.

Also read: రెండో భార్య సాక్షిగా మూడో పెళ్లి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే

ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు లోనైన రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు నెలల క్రితం మట్టి త్రవ్వకాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. అయితే, అధికారులు, అధికార పార్టీ నాయకులకు మామూళ్లను అందించలేక మట్టి తవ్వకాలను నిలిపివేసినట్టు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా తాము మట్టి తవ్వకాలు చెప్పటడ్డం లేదని, అయినప్పటికీ అధికారులు తనమీద ఉద్దేశపూర్వకంగానే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని అరోపించాడు. తన హిటాచీని లారీలో తీసుకొని రావడంతో దెబ్బతిందని యజమాని వాపోయాడు. దాని మరమ్మతులకు దాదాపు రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన వద్దనున్న పురుగుల మందును రూరల్ పోలీసు స్టేషన్ వద్ద తాగేందుకు ప్రయత్నించాడు. గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన స్ధానికులు అతనిని అడ్డుకున్నారు. పురుగుల మందు డబ్బను రమేష్ వద్ద నుండి లాక్కున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.అనంతరం, గ్రామీణ పోలీస్ స్టేషన్ సిబ్బందిపై, గనుల భూగర్భ శాఖ అధికారులపై కేసు నమోదు చేయాలని ఎస్సై సురేష్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు