Also Read: సైకిల్ ఎక్కిన జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ
కార్యాచరణ రూపొందించేందుకు నల్లమిల్లి పిలుపుమేరకు రామవరం చేరుకున్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా ఆందోళన బాటపట్టారు. అదే విధంగా పార్టీ గుర్తు అయిన సైకిల్ని కూడా మంటలో పడవేసి తమ నిరసనలు తెలిపారు. కార్యకర్తలను నిలువరించేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు మనోజ్ రెడ్డి ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. చివరికి కార్యకర్తలు శాంతించి సమావేశం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నాయకులు ప్రసంగాలు చేస్తూ కార్యకర్తలు ఆందోళన చెందవద్దంటూ పిలుపునిచ్చారు.
Also read: తిరుమలలో చిరుత పులి కలకలం.. అలర్ట్ అయిన టీటీడీ..!
ఈ క్రమంలోనే రామవరంలో నల్లమిల్లి ఇంటి వద్ద టిడిపి శ్రేణులు ఆందోళన చేస్తున్న సమయంలో ఒక కార్యకర్త నల్లమిల్లి నివాసం పైకి వెళ్లి కిందకి దూకే ప్రయత్నం చేశాడు. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు మనోజ్ రెడ్డి చాకచక్యంగా అతనిని పట్టుకుని భవనం నుండి కిందకు దించడంతో నాయకులు ఊపిరి పీల్చుకున్నారు