Double Ismart: డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానట్లేనా..? షాకింగ్ అప్డేట్

రామ్- పూరి జగన్నాథ్ లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. 2024 మార్చి 8 న విడుదుల చేయాలనుకున్న ఈ మూవీ సమ్మర్ కి వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Double Ismart: డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానట్లేనా..? షాకింగ్ అప్డేట్
New Update

Double Ismart: ఈ మధ్య కాలం సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ రావడం ఎక్కువగా జరుగుతుంది. ఇలా సీక్వెల్ గా విడుదలైన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాలను అందుకున్నాయి. బాహుబలి 2, కేజీఎఫ్, కార్తికేయ 2... ప్రస్తుతం సీక్వెల్ గా రాబోతున్న చిత్రాల్లో ఒకటి డబుల్ ఇస్మార్ట్.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్. 2019 లో రిలీజైన ఇస్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కావడంతో డబుల్ ఇస్మార్ట్ చేస్తామని పూరి జగన్నాథ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 2023 జులై నెలలో పూజ కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన ఈ మూవీ.. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ చిత్రీకరణ ముంబై లో జరిగింది. ఆ తర్వాత సెకండ్ షెడ్యూల్ షూటింగ్ థైలాండ్ లో జరుపుకోనున్నట్లు టాక్ వినిపించింది. రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డబుల్ ఇస్మార్ట్ ను మేకర్స్ 2024 మార్చ్ 8 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.

Also Read: Pindam OTT Release: ఓటీటీలో భయపెట్టడానికి వచ్చేస్తున్న పిండం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

publive-image

డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ వాయిదా

అయితే తాజాగా రిలీజ్ డేట్ కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా మేకర్స్ డబుల్ ఇస్మార్ట్ ను సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే చిత్ర బృందం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో సినిమా కోసం ఆసక్తిగా ఉన్న అభిమానులకు షాక్ తగిలినట్లే. డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరీ కనెక్ట్స బ్యానర్ పై ఛార్మి కౌర్. డైరెక్టర్ పూరి కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్త్ ఈ మూవీ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆ మధ్య కాలం రామ్ - సంజయ్ దత్త్ మధ్య మంచి యాక్షన్ సీన్స్ కూడా ప్లాన్ చేసినట్లు వార్తలు వినిపించాయ

Also Read: Prabhas: రాజాసాబ్ నుంచి సూపర్ అప్డేట్.. రిలీజ్ అప్పుడే

#double-ismart-release #double-ismart-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe