Allari Naresh: రవితేజ బాటలో.. అల్లరి నరేష్ 'బచ్చల మల్లి'..!

సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ పై అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం బచ్చల మల్లి. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. డైరెక్టర్ అనిల్ రావి పూడి సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించారు.

Allari Naresh: రవితేజ బాటలో.. అల్లరి నరేష్ 'బచ్చల మల్లి'..!
New Update

Allari Naresh: నటుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఆయన 63 వ చిత్రంగా హాస్య బ్యానర్ పై 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగా దేవి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బచ్చల మల్లి. రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 1 న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూజ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు, మారుతి పాల్గొన్నారు. మేకర్స్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే సినిమా యాక్షన్ తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

publive-image

కామెడీ సినిమాలతో అందరిని ఆకట్టుకున్న అల్లరి నరేష్ కొంత కాలంగా కామెడీ సినిమాలు పక్కన పెట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమాల పై దృష్టి పెట్టారు. 2021లో విడుదలైన యాక్షన్ త్రిల్లర్ నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు అల్లరి నరేష్. ఇక ఇప్పుడు బచ్చలి మల్లి సినిమాలో పెరటి దొంగ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం అల్లరి నరేష్ సరి కొత్త మేక్ ఓవర్ లో కనిపించనున్నారు.

publive-image

ఇటీవలే రవితేజ నటించిన బయోపిక్ టైగర్ నాగేశ్వర్ రావు సూపర్ హిట్ టాక్ పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు అల్లరి నరేష్ బచ్చల మల్లి కూడా అదే బాటలో నడవబోతుంది. 1990 నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆంద్రప్రదేశ్ లోని తుని ప్రాంతానికి చెందిన పెరటి దొంగ బచ్చల మల్లి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు రావు రమేష్, హరితేజ, ధన్ రాజ్, సాయి కుమార్, కోట జయరామ్ కీలక పాత్రల్లో నటించనున్నారు.

publive-image

Also Read: Trisha : ‘యానిమల్’ పై త్రిష పోస్ట్.. నెట్టింట్లో వైరల్ ..!

#bachala-malli-movie #allari-nareshs-bachala-malli-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe