Holi 2024: తేడావస్తే "రంగు పడుద్ది.." హోలీ పండగపూట ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందే.!

హోలీ అంటే రచ్చరంబోలా. వింత వింత కలర్లు పులుముకునే వరకూ వెళ్తుంది. అనందం హద్దులు దాటుతున్నా కొద్దీ..హోలీపండగ తీరు కూడా మారుతుంది. సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే జాగ్రత్తలు చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే రంగుపడ్డుద్ది అంటూ హెచ్చరిస్తున్నారు.

New Update
Holi 2024: తేడావస్తే "రంగు పడుద్ది.." హోలీ పండగపూట ఈ  జాగ్రత్తలు తీసుకోవల్సిందే.!

Holi 2024:  రంగుల పండుగ హోలీ రాబోతోంది. ఈ ఏడాది హోలీ మార్చి 25న..ఘనంగా జరుపుకోనున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. పిల్లల్లో హోలీ గురించి చాలా ఉత్సాహం ఉంటుంది.రంగులు పడేది ముఖానికే కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం ముందస్తుగా రెండు మూడు లేయర్లుగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చెవులు వాటి వెనక భాగాల్లోనూ రాసుకోవాలి. రంగుల ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది. ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ ను తప్పకుండా రాసుకోవాలి. నీళ్లతో ఆడే అవకాశంఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ప్రూఫ్ ను ఎంచుకుంటే చాలా మంచిది.

కళ్లు మరింత భద్రంగా ఉంచుకోవాలి సుమా:

చిన్నా పెద్దా కలిసి రంగులు పూసుకుని హోలీ పండగను సంతోషంగా జరపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కొన్నిసార్లు చిన్న పొరపాటు, చిన్న నిర్లక్ష్యం కూడా సంతోషకరమైన వాతావరణాన్ని విషాదంగా ముగుస్తుంది. అలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉత్సవం ఉత్సాహం జరుపుకోవాలనేది ప్రతి ఒక్కరి కోరిక. హోలీ పండగ నేపథ్యంలో రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా నేత్రాల విషయంలోనూ జాగ్రత్త అవసరమని కంటి వైద్యులు చెబుతున్నారు.

- హోలీ పండగ రోజు ఎక్కువగా సింథటిక్‌ రంగులు వాడుతుంటారు. రసాయనాలతో కూడిన ఈ రంగులు చర్మంతోపాటు కంటి ఆరోగ్యంపై తీవ్ర  ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- పారిశ్రామిక డైలు, ఆల్కాలీస్‌తో తయారైన ఈ రంగుల్లో సింథటిక్‌, ఆస్బెస్టాస్‌, సిలికా, మైకా, సీసం వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలుపుతుంటారు. ఇవి విషపూరితంగా ఉంటాయి. వీటి వల్ల కొన్నిసార్లు శాశ్వతంగా చూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది.

-నేటి కాలంలో చాలా మంది కాంటాక్ట్‌ లెన్సులు వాడుతుంటారు. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లలో రంగులు పడకుండా జాగ్రత్తగా ఉండాలి.

- కాంటాక్ట్‌ లెన్సుల్లో హైగ్రోస్కోపిక్‌ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి సులభంగా నీటిని పీల్చుకుంటాయి.రంగు నీళ్లు కళ్లలో పడితే అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

-కళ్లల్లో రంగు పడితే నులమకూడదు. అలా చేస్తే కంటి పొరల్లో రాపిడి జరిగి కార్నియా దెబ్బతింటుంది. కంటిలో రంగు పడితే వెంటనే చేతులు శుభ్రం చేసుకొని, అరచేతిలోకి స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని ఆ నీటిలో కళ్లను సున్నితంగా కదిలించే ప్రయత్నం చేయాలి.

- కంట్లో రంగులు పడినప్పుడు  నీరు చిమ్మడం, కర్చిఫ్,  టిష్యూతో  నలుసు తొలగించకూడదు. అది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

-ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. వైద్యుల సూచనలు లేకుండా ఐడ్రాప్స్‌, ఆయింట్‌మెంట్‌లు వాడకూడదు.

ఇది కూడా చదవండి: 8 గంటల జిమ్ వర్క్ అవుట్, 300 పుష్ అప్‌లు! వెస్టిండీస్ దిగ్గజం సూపర్ సిక్స్ వెనుక రహస్యం ఇదేనా?

Advertisment
తాజా కథనాలు