DEEPFAKE: డీప్ ఫేక్ వీడియోలను గుర్తించటం ఎలా?

ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ శరవేగంగా వ్యాపిస్తున్నవేళ కొందరు సైబర్ కేటుగాళ్లు డీప్ ఫేక్ వీడియోలతో రెచ్చిపోతున్నారు. డీప్ ఫేక్ వీడియోలను తెలుసుకోవటం ఎలా నో ఈ 5 చిట్కాల ద్వారా తెలుసుకోండి.

DEEPFAKE: డీప్ ఫేక్ వీడియోలను గుర్తించటం ఎలా?
New Update

ఇటీవలె సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారిన డీప్ ఫేక్ వీడియోలు చాలామంది ప్రభుత్వ పెద్దలు,సినీ పారిశ్రామిక వ్యక్తులను కలవరపెడుతున్న విషియం తెలిసిందే. వీటిపై స్వయాన దేశ ప్రధాని నరేంద్రమోదీ కూడా స్పందించారు. కాని డీఫ్ ఫేక్ వీడియోలను ఈ 5 చిట్కాల ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

1.ముఖ కవళికలు : డీప్‌ఫేక్ వీడియో లో చెప్పోకోదగిన ది ఒకటి ముఖ కవళికలు. ఇలాంటి వీడియోలో మాట్లేడప్పుడు  చూసే తీరును క్షుణంగా పరీశీలించండి. డీప్‌ఫేక్ వీడియోలో అల్గారిథమ్ లు తరచుగా  పునరావృతం చేయడానికి కష్టపడతాయి. వాటిని మనము పరిశీలించినప్పుడు  అది నిజమో కాదో తెలుస్తుంది.

2.ఆడియో నాణ్యత తగ్గట్టుగా పెదవులను గమనించండి: డీప్‌ఫేక్ వీడియోలు తరచుగా ఆడియో ట్రాక్  ,విజువల్స్ మధ్య వ్యత్యాసాల భట్టి కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఆడియో కు లిప్ సింకింగ్ తీక్షణంగా పరిశీలిస్తే ఊరికే గుర్తుపట్టేయోచ్చు. మాట్లేడప్పుడు  వచ్చే ధ్వని తరంగాలకు ముఖ కదలికలు సరిపోతున్నాయా లేదో కూడా  తెలుసుకోవచ్చు.

3. లైటింగ్ , నీడలను పరిశీలించండి: వీడియోలో  లైటింగ్,నీడలు భట్టి కూడా డీఫ్ ఫేక్ వీడియోలను కనుగోనవచ్చు.  వీడియో మొత్తం లో, వస్తువలపైన,వ్యక్తులు వారి నీడల పైన శ్రద్ధ వహించండి. దీని వల్ల కనిపించే వీడియో బ్యాక్ గ్రౌండ్  భిన్నంగా .   కృత్రిమంగా సృష్టించారో లేదో తెలుసుకోవచ్చు.

4. లైవ్ వీడియో కాల్‌ వివారాలు : ఇది లైవ్ కాల్‌లలో మాత్రమే పని చేస్తుంది, నేరగాళ్లు మీతో నేరుగా మాట్లాడగలగడం అత్యంత ప్రమాదకరం. డీప్‌ఫేక్‌ను గుర్తించేందుకు అవతలి వైపున ఉన్న వ్యక్తిని వారి ముఖం ముందు చేయి కదిలించమని మీరు అడగవచ్చు, కానీ డీప్‌ఫేక్ టెక్నాలజీ అభివృద్ధి చెందినందున ఇది అంతగా పని చేయదు. కాని వారి ముఖం ముందు భూతద్దం లేదా గాజు సీసా పెట్టమని అడగడం ద్వారా నిజమో కాదో పసిగొట్టవచ్చు.అయితే, భవిష్యత్తులో డీప్‌ఫేక్ టెక్నాలజీ తో యాంటీ-డీప్ ఫేక్ హెడ్‌సెట్ వంటి పరికరాలను (AI) తో కలిపి ఉపయోగించవచ్చు.

5. డీప్‌ఫేక్ డిటెక్షన్ టూల్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి: డీప్‌ఫేక్‌ వీడియోలను గుర్తించటానికి డీప్ ఫేక్ డిటేక్షన్ టూల్స్ సాఫ్ట్ వేర్ చాలా ఉపయోగపడుతుంది.  వీటిలో   AIని ఉపయోగించడం ద్వారా  సులభతరంగా కనుకోవచ్చు. అయినప్పటికీ, ఇవి  హాని కలిగిస్తాయి. ఎందుకంటే వీటి పై ముందుగానే స్కామర్‌లు నకలీ అల్గారిథమ్‌లను  గుర్తించలేకుండా ఉండటానికి   శిక్షణా శిబిరాన్నే నడిపిస్తున్నారు. వాటి వల్ల భవిష్యత్తులో  యాంటీ-డీప్‌ఫేక్ హెడ్‌సెట్ వంటి పరికరాల నుంచి డేటా ఇంజెక్షన్‌తో కలిసి మెరుగ్గా పని చేస్తాయి.

#deep-fake #vidios
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe