చైనాలో దంచికొడుతున్న వానలు..రెడ్ అలర్ట్ జారీ...!!

చైనాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షం కారణంగా ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. రానున్న రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

New Update
చైనాలో దంచికొడుతున్న వానలు..రెడ్ అలర్ట్ జారీ...!!

చైనా రాజధాని బీజింగ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు 11 మంది మరణించగా, పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు సమాచారం. చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ ప్రకారం, వరదలలో 27 మంది అదృశ్యమయ్యారని పేర్కొంది. పశ్చిమ బీజింగ్‌లోని మెంటౌగౌ జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ఇద్దరు మరణించారు. బీజింగ్‌లోని మరో మారుమూల జిల్లా అయిన మెంటౌగౌలో ఆదివారం నుంచి దశాబ్దంలో ఎన్నడూ లేనంత భారీ వర్షం కురుస్తోంది.

ఇదిలా ఉండగా, శనివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల మధ్య, బీజింగ్ సగటు వర్షపాతం 138.3 మిమీ వర్షం కురవగా...మొత్తం 2.097 బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం నమోదు అయ్యింది. బీజింగ్ మునిసిపల్ ఫ్లడ్ కంట్రోల్ ఆఫీస్ డిప్యూటీ కమాండర్ లియు బిన్ మాట్లాడుతూ, "బీజింగ్‌లో సగటు వర్షపాతం జూలై 21, 2012 తుఫాను స్థాయిని తాకిందని తెలిపారు. ఈ ఏడాదిలో కురిసిన భారీ వర్షాల వల్ల 79 మంది మరణించారు. ఈసారి ఫాంగ్‌షాన్ మెంటౌగౌలలో సగటు వర్షపాతం జిల్లాలు 400 మి.మిటర్లుగా నమోదు అయ్యింది. ఇది 21 జూలై 2012న కురిసిన వర్షపాతం కంటే ఎక్కువ అని పేర్కొన్నారు.

బీజింగ్ మునిసిపల్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, బీజింగ్ నగరంలో వరదల వల్ల ప్రభావితమైన 52,384 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వరదల కారణంగా చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. రవాణావ్యవస్థ స్తంభించిపోయింది. రైల్వే స్టేషన్లు మూతపడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా ప్రభుత్వ మీడియా నివేదించింది. భారీ వర్షాల కారణంగా 107 పర్వత రహదారులను మూసివేసినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. బీజింగ్ వరద నియంత్రణ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం... వర్షం కారణంగా మెంటౌగౌలోని అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి రోడ్లు దెబ్బతిన్నాయి. కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. బుధవారం వరకు బీజింగ్‌లోని ఫాంగ్‌షాన్, మెంటౌగౌ, ఫెంగ్‌టై జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.

కాగా చైనా రాజధాని బీజింగ్‌లో సాధారణంగా తక్కువ వర్షపాతం ఉంటుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. కానీ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీజింగ్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. భారీ నష్టాన్ని కలిగించాయి. అదే సమయంలో, ఉత్తర చైనాలోని ఇతర ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు