Cyclone Remal : రెమాల్ తుపానుతో బెంగాల్ అతలాకుతలం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు భయంకరంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. భారీ ఈదురుగాలులకు పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది.
Also Read: లక్కీ ఛాన్స్.. ఒకేచోట మూడు వజ్రాలు.!
పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. రోడ్లపై పడిపోయిన చెట్లను సిబ్బంది తొలగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. తుపాన్ ప్రభావంతో బెంగాల్‌వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిబీర్ బగాన్‌లో ఇంటి గోడ కూలడంతో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తుపానుతో మౌలిక సదుపాయాలు, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లుతుంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read: నేను రాలేను.. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా.!
బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తుపాను విధ్వంసం సృష్టిస్తోంది. సాగర్‌ద్వీపం, సుందర్ బన్స్, కాక్‌ద్వీప్, దక్షిణ 24 పరగణాల జిల్లాలో హైఅలర్ట్ జారీ చేశారు. కోల్‌కతా విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు రద్దు చేశారు.
ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.