/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-4.jpg)
Vishaka District: అల్లూరి జిల్లా రాజవోమ్మంగి మండలంలో ఎడతెరపి లేని వర్షాలకు మన్యం వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మండలం లోని ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. లబ్బర్తి - అనంతగిరి గ్రామాల మధ్య కొండ కాలువలు ఉప్పొంగుతున్నాయి. ఏజెన్సీ లో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
రాజవొమ్మంగి మండల కేంద్ర వైపు ఐదు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిరిపుత్రులు ఇక్కట్లు పడుతున్నారు. అటు నెల్లిమెట్ల, లాగరాయి గిరిజన గ్రామాలకు కొండ కలవలు ఉదృతంగా ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
Also read: పెద్దవాగు ఎఫెక్ట్ ..ప్రభుత్వం హైఅలర్ట్..!