Rains: విజయవాడలో వాన బీభత్సం.. ఎడతెరిపి లేని వర్షం.! విజయవాడ నగర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. By Jyoshna Sappogula 25 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada Rains: విజయవాడ నగర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్నటి వరకూ విజయవాడలో ఉక్కపోత వాతావరణం ఉండగా.. నేడు ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. Also Read: పంట పొలాల్లో వజ్రాల వేట.. రైతుకు దొరికిన వజ్రం.. ఖరీదు తెలిస్తే అవాక్కవుతారు..! ఏలూరు, బందరు, మొగల్రాజపురం, సింగ్ నగర్, వన్ టౌన్ లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో వర్షపు నీటితో కలిసి డ్రైనేజీ వ్యర్థ జలాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. #vijayawada-rains మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి