Hyderabad : హైదరాబాద్ లో వాన దంచికొట్టింది. అత్యధికంగా యూసుఫ్‌గూడలో 51.3 మి.మీ, ఖైరతాబాద్‌లో 48.0, కుత్బుల్లాపూర్‌లోని ఆదర్శ నగర్‌లో 44.3, బాలానగర్‌లో 42.5, షేక్‌పేటలో 42.3 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ వెల్లడించింది. RTC క్రాస్‌రోడ్‌లోని స్టీల్ బ్రిడ్జిపై వరద నీరు నిలిచిపోయింది. నగరంలో పలుచోట్ల రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిని తొలగించేందుకు డీఆర్ఎఫ్ బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
Also Read: విమానంలో ‘బాంబ్’ నోట్ కలకలం.. వాష్‌రూంలో టిష్యూ పేపర్ పై..
భారీ వర్షాల నేపథ్యంలో GHMC అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 7 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. డీఆర్ఎఫ్ బృందాల చర్యల కోసం 040-21111111 లేదా 9000113667 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.