China Rains: చైనా దేశానికి అత్యంత కీలకమైన, ఆర్థిక కేంద్ర మైన హాంకాంగ్(Hong Kong)పై వరణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. హాంకాంగ్‌లో భారీ వర్షం(Rains) కురిసింది. 140 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ రానంత వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకపోయిన ప్రజలను రక్షించేందుకు అధికారులు అవసరమైన సహాయక చర్యలు తీసుకుంటున్నారు. భారీ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయినట్లు చైనా మీడియాలో వార్తలు వస్తున్నాయి. పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హాంకాంగ్‌లో పాఠశాలలు, కార్యాలయాలకు బంద్ ప్రకటించచారు. ఒక్క హాంకాంగ్ మాత్రమే కాదు.. దక్షిణ చైనాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఒక్క గంటలోనే 158. మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చైనా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్య ఈ స్థాయిలో వర్షం కురిసిందని, 1884 తరువాత ఇదే అత్యధికం అని చెబుతున్నారు అక్కడి అధికారులు. ఇక క్వోలూన్, హాంకాంగ్ ఉత్తరం వైపున 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక 24 గంటల వ్యవధిలో హాంకాంగ్‌లో 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని చెబుతున్నారు అధికారులు.
భారీ వర్షం, వరదల కారణంగా హాంకాంగ్ సహా దక్షిణ చైనాలోని పలు నగరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. చాలాచోట్ల రవాణా సేవలు, వ్యాపారాలు నిలిచిపోయాయి. అత్యవమైతేనే తప్ప కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలని, లేదంటే ఇంటి వద్దే ఉండి చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. బస్సులు, రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Also Read:
Andhra Pradesh: రూ. 15 లక్షల కోట్లు దోచుకెళ్లారు.. కేంద్ర ప్రభుత్వంపై డి. రాజా షాకింగ్ కామెంట్స్..