Hyd Rain: నగర శివారులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్.!

నగర శివారులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లు కూలాయి. తుమ్మలూరు, కందుకూరు రహదారిపై 4 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. చెట్లను తొలగించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

New Update
Weather Alert : రాగల రెండ్రోజుల పాటు వర్షాలు..

Hyd Rain:  హైదరాబాద్ నగర శివారులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై చెట్లు కూలాయి. మహేశ్వరం మండలం తుమ్మలూరు, కందుకూరు రహదారిపై 4 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై పడిన చెట్లను తొలగించేందుకు సిబ్బంది యత్నిస్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అటు గత కొన్ని రోజులుగా నిప్పులు కొలిమిలా మారిన తెలంగాణ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం కాస్త చల్లబడింది. ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం చల్లబడింది. ఆసిఫాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మూడు , నాలుగు గంటల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. 

ఇక తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజులు మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇకఅటు ఏపీలోనూ ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఉత్తరకోస్తాతోపాటు దక్షిణకోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇది కూడా చదవండి: చల్లబడిన వాతావరణం..మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు