Polavaram: పోలవరం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు రోజు రోజుకూ గోదావరి ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే నుండి (4,84,022) నాలుగు లక్షల 84 వేల 22 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం స్పిల్ వే ఎగువన 30.00 మీటర్లుగా నీటిమట్టం నమోదయినట్టు అధికారులు తెలిపారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం 32 అడుగులకు పెరగడంతో..పోలవరంలో నీటిమట్టం సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పాపికొండలు విహారాయాత్ర నిలిపివేయగా.. పోచమ్మ తల్లి ఆలయం వరద నీటిలో మునిగిపోవడం తో ఆలయాన్ని మూసివేశారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లద్దని అధికారు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. గంటగంటకు పెరుగుతోన్న నీటిమట్టం..!