Saggubiyyam kesari: టేస్టీ, హెల్తీ సగ్గుబియ్యం కేసరి.. పిల్లలకు బెస్ట్ రెసిపీ

సగ్గుబియ్యం ఆరోగ్యానికీ చాలా మంచివి. కానీ వీటితో వంటకాలు చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకసారి సగ్గుబియ్యం కేసరి ట్రై చేయండి అదిరిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
Saggubiyyam kesari: టేస్టీ, హెల్తీ సగ్గుబియ్యం కేసరి.. పిల్లలకు బెస్ట్ రెసిపీ

Saggubiyyam Kesari: ఈ మధ్య కాలం సగ్గుబియ్యం వాడకం చాలా వరకు తగ్గిపోయింది. సగ్గుబియ్యంలో విటమిన్స్ (Vitamins), మినరల్స్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. అలాగే ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు శరీరానికి కూడా చాలా మేలు చేస్తాయి. శరీరంలోని అధిక ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని ఇస్తాయి. చాలా మంది వీటితో కొన్ని వంటకాలు మాత్రమే చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ సగ్గుబియ్యంతో ఎన్నో రకాల వంటకాలు వండుకోవచ్చు. వాటిలో ఒకటి సగ్గుబియ్యం కేసరి. ఇది తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం..

సగ్గుబియ్యం కేసరికి కావలసిన పదార్థాలు

సగ్గబియ్యం: ఒక కప్పు, నెయ్యి: ఒక స్పూన్ , డ్రై ఫ్రూట్: సరిపడ, షుగర్: అరకప్పు, ఫుడ్ కలర్: కావల్సినంత, ఇలాచి పౌడర్: ఒక స్పూన్, నీళ్లు: సరిపడ, బాదం, కిస్మిస్ : తగినన్ని

సగ్గుబియ్యం కేసరి తయారీ విధానం

  • ముందుగా సగ్గుబియ్యాన్ని నీటిలో వేసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా నానిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి
  • ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి.. వాటిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక ఈ నీళ్లు బాగా మరిగిన తరువాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.
  • సగ్గుబియ్యం వేసిన తర్వాత ఉండలు రాకుండా బాగా కలుపుతూ ఉండాలి. అవి మెత్తగా ఉడికిన తరువాత కాస్త నెయ్యి వేసి పక్కన పెట్టుకోవాలి.

Also Read: Kitchen Tips: ఇంట్లో పప్పుకు పురుగు పడుతుందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే

publive-image

  • ఇప్పుడు మరో పాన్ తీసుకొని.. డ్రై ఫ్రూట్స్, కాస్త నెయ్యి వేసి కాసేపు వేయించాలి. దీంట్లోనే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి వేయించుకోవాలి.
  • ఇవి కొద్దీ సేపు వేగిన తరువాత అరకప్పు షుగర్ వేసి కలపాలి. అదే వేడికి పంచదార కరిగిపోయి పాకంలా తయారవుతుంది. చిన్న మంట పై ఉంచి అడుగుపట్టకుండ కలుపుతూ ఉండాలి. చివరిలో పై నుంచి మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్, నెయ్యి వేస్తే సరిపోతుంది.
  • అంతే టేస్టీ, హెల్తీ, యమ్మీ సగ్గుబియ్యం కేసరి రెడీ. సగ్గుబియ్యం ఆరోగ్యానికి చాలా మంచివి. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.

Also Read: Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?

Advertisment
Advertisment
తాజా కథనాలు