Health Tips: మీ పిల్లలు బరువు పెరగాలా..? అయితే ఈ ఫుడ్స్ పెట్టండి

పోషకాహార లోపంతో కొంత మంది పిల్లలు వయసుకు తగిన బరువు పెరగరు. పిల్లలు బరువు పెరగడానికి వారి డైట్ లో ఈ ఆహారాలను చేర్చండి. అరటిపండు, గుడ్లు, ఆలూ, నట్స్, పాల ఉత్పత్తులు, చికెన్, పీనట్ బటర్. వీటిలోని హై కెలరీ, ప్రోటీన్ కంటెంట్ బరువు పెరగడానికి సహాయపడతాయి.

New Update
Health Tips:  మీ పిల్లలు బరువు పెరగాలా..? అయితే ఈ ఫుడ్స్ పెట్టండి

Health Tips: ఈ మధ్య కాలం చాలా మంది తల్లిదండ్రుల్లో సహజంగా కనిపిస్తున్న సమస్య పిల్లలు బరువు పెరగకపోవడం. ప్రతీ ఒక్కరూ తమ పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలని కోరుకుంటారు. కానీ పిల్లలు ఆహారం చూపే అశ్రద్ద కారణంగా.. శరీరానికి సరైన పోషకాలు అందవు. దీంతో పిల్లల్లో పోషకాహార లోపం తద్వార బరువు తగ్గడం జరుగుతుంది. బక్క పలుచగా ఉన్న పిల్లలు బరువు పెరగడానికి.. వారి డైట్ లో ఈ ఆహారాలను చేర్చండి.

పాల ఉత్పత్తులు

పాల ఉత్పత్తులలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఎదిగే పిల్లల ఆహారంలో వీటిని తప్పకుండా చేర్చాలి. పాలలోని క్యాల్షియం ఎముకలను దృఢంగా చేయడంతో పాటు పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుంది. పాలలోని ఫ్యాట్, ప్రోటీన్ కంటెంట్ బరువు పెరగడానికి తోడ్పడతాయి.

Also Read : South Indian Dishes: బియ్యం పిండితో చేసే.. పాపులర్ సౌత్ ఇండియన్ డిషేస్

మీట్

చికెన్ లో ప్రోటీన్ , కేలారీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  ప్రోటీన్ పిల్లల్లో కండరాల పెరుగుదలతో పాటు బరువు పెరగడానికి కూడా సహాయపడుతుంది.

publive-image

పీనట్ బటర్

పుష్కలమైన ప్రోటీన్ కోసం పీనట్ బటర్ సరైన ఎంపిక. ఇది బలహీనమైన కండరాళ్ళను.. దృఢంగా చేసి పిల్లల బరువు పెరుగుదలకు కారణమవుతుంది. దీనిని కూరగాయలు,బ్రెడ్ లేదా పండ్లతో తీసుకోవాలి. అతిగా తీసుకోవడం కూడా మంచిది కాదు

గుడ్లు

గుడ్లలో ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పిల్లల డైట్ గుడ్లు అలవాటు చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆమ్లెట్ కాకుండా ఉడకబెట్టిన గుడ్లను ఇస్తే  శరీరానికి ఎక్కువ పోషకాలు అందుతాయి.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read : Health Tips: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే శరీరంలో అది తక్కువైనట్లే

Advertisment
Advertisment
తాజా కథనాలు