Heart Health: ఈ ఆహారాలతో.. మీ గుండె సమస్యలు మాయం అంతే..!

గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. జీవన శైలి విధానాలు, ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపును. గుండె ఆరోగ్యం కోసం మంచి కొవ్వులు, ఫైబర్, విటమిన్స్ కలిగిన పండ్లు, ఆకుకూరలు, బాదం, లీన్ ప్రోటీన్, తృణ ధాన్యాలు, సోడియం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

New Update
Heart Health: ఈ ఆహారాలతో.. మీ గుండె సమస్యలు మాయం అంతే..!

Heart Health: ఈ మధ్య కాలం చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండె పోటుతో మరణిస్తున్నారు. మనం రోజూ పాటించే తినే ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్పులు గుండె ఆరోగ్యం పై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ బిజీ లైఫ్ లో గుండె ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాలు గుండె ఆరోగ్యం కాపాడును. గుండె ఆరోగ్యం కోసం ఈ ఆహారపు అలవాట్లను మీ డైట్ లో చేర్చండి.

పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి

మనం రోజు తినే ఆహారంలో పోషకాహారాలు ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి. వీటిలోని విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.

బాదం తీసుకోవాలి

రోజూ బాదాం పప్పు తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించును అలాగే గుండె సంబంధిత వాపు, మంటను తగ్గించును. స్నాక్స్ రూపంలో లేదా ఏదైనా ఆహారంలో బాదం తినడం వల్ల HDLకొలెస్ట్రాల్ స్థాయిలను పెంచును. ఇవి గుండె పోటు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించును.

తృణ ధాన్యాలు అలవాటు చేసుకోండి

గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి మీ ఆహారంలో శుద్ధి() చేసిన ధాన్యాల కంటే తృణ ధాన్యాలు తీసుకోవడం సరైన ఎంపిక. బ్రౌన్ రైస్, హోల్ వీట్ బ్రెడ్, తీసుకుంటే మంచిది. వీటిలోని ఫైబర్ గుణాలు రక్తంలోని చక్కర స్థాయిల నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడును.

మంచి కొవ్వులను తీసుకోవాలి

మన ఆహారంలో సాచురేటెడ్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ కు బదులు శరీరానికి మంచి కొవ్వులను అందించే అవకాడో ఆయిల్ , ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ తీసుకోండి. వీటిలోని కొవ్వులు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లిపోప్రొటీన్ ను తగ్గించును. అధిక లిపోప్రొటీన్ స్థాయిలు గుండె వ్యాధులు, గుండె పోటుకు కారణమవుతుంది.

సోడియం తక్కువగా తీసుకోవాలి

అధిక సోడియం కంటెంట్ తీసుకుంటే రక్త పోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపును. రెస్టారెంట్ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించాలి వాటిలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ప్రోటీన్ మితంగా తీసుకోవాలి

లీన్ ప్రోటీన్ ఉండే ఆహారాలు తీసుకోవాలి పౌల్ట్రీ మీట్, ఫిష్, పప్పు దినుసులు డైట్ లో చేర్చాలి. రెడ్ మీట్ తినడం తగ్గించాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Happiness: ఎవరితోనూ పనిలేదు.. ఇవి పాటిస్తే మీ లైఫ్‌ అంతా హ్యాపీనే.

Advertisment
Advertisment
తాజా కథనాలు