Digestive Drinks: గ్యాస్, కడుపులో మంటగా ఉందా.. ఈ డ్రింక్స్ తాగితే అన్నీ మాయం..!

అజీర్ణం, కడుపులో నొప్పి, మంట, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నాయా? అయితే సహజమైన మూలికలతో చేసిన సోంపు టీ, గ్రీన్ టీ, మిరియాల టీ, వాము టీ, అల్లం టీ పానీయాలను తాగడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందొచ్చు.

Digestive Drinks: గ్యాస్, కడుపులో మంటగా ఉందా.. ఈ డ్రింక్స్ తాగితే అన్నీ మాయం..!
New Update

Healthy Digestive Drinks: ఈ మధ్య కాలంలో చాలా మంది పనుల్లో బిజీ బిజీ గా ఉంటూ.. రోజూ తినే ఆహారపు అలవాట్ల పై అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. సరైన టైం కు ఆహరం తినకపోవడం, మీల్ స్కిప్ చేయడం, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు జీర్ణక్రియ సమస్యలకు కారణమవుతాయి. ఇలా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు సహజమైన మూలికలతో తయారు చేసిన ఈ పానీయాలను తీసుకుంటే జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు అజీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తాయి.

జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పానీయాలు

పుదీనా ఆకులతో చేసిన టీ

పుదీనా ఆకులతో చేసిన టీ తాగితే.. గ్యాస్, కడుపులో మంట, కడుపుబ్బరం, అజీర్ణత వంటి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడును. అంతే కాదు ఇది జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచును.

publive-image

అల్లం టీ

సాధారణంగా చాలా మంది జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అల్లం ఎక్కువగా వాడుతుంటారు. అల్లం పోషకాల శోషణకు అవసరమయ్యే బైల్ జ్యూస్ ను ఉత్పత్తికి తోడ్పడును. ఇది కడుపు నొప్పి, డయేరియా, కడుపులో పుండ్లు వంటి సమస్యలను దూరం చేయును.

గ్రీన్ టీ

గ్రీన్ టీ తాగడానికి చాలా తక్కువ మంది ఇష్టపడతారు. కానీ దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీ అజీర్ణ సమస్య, శరీరంలో ఉష్ణోగ్రత, మధుమేహం సమస్యలను నియంత్రించడంలో సహాయపడును.

publive-image

సోంపు టీ

ఇది కండరాళ్ళను విశ్రాంత పరచడంతో పాటు నొప్పి, జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. సోంపు టీ తాగితే జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీర నిర్విషీకరణకు సహాయపడును. అంతే కాదు దీనిలోని ఫైబర్ గుణాలు మలబద్ధకం సమస్యను దూరం చేయును.

publive-image

వామాకు టీ

వామాకుతో చేసిన టీ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగ్గా చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. జీర్ణక్రియకు కావాల్సిన ఎంజైమ్స్ ఉత్పత్తిని మెరుగుపరిచి.. అజీర్ణ సమస్యలను దూరం చేయును.

publive-image

Also Read: Nutritional Deficiency: మీ పిల్లల్లో ఈ పోషకాహార లోపాలు ఉన్నాయా.. అయితే జాగ్రత్త..!

#digestive-drinks #drinks-for-healthy-digestive-sysytem
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe