Moong Dal Halwa: నోరూరించే పెసర పప్పు హల్వా.. సింపుల్ అండ్ ఈజీ పెసర పప్పుతో కూర, పెసరట్టు, పప్పు అందరికీ తెలిసిన కామన్ దిషేస్. కానీ పెసర పప్పుతో అదిరిపోయే హల్వా కూడా చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. టేస్టీ, హెల్తీ పెసర పప్పు హల్వా తయారీ విధానం కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 28 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Moong Dal Halwa: సహజంగా పప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటే. వాటిలో ఒకటి పెసర పప్పు. రోజూ ఆహారంలో వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పెసర పప్పు, పెసర పప్పుతో ఆకుకూర, పెసరట్టు, పెసర గారెలు ఇలా ఎన్నో రకాలు టేస్టీ దిషెస్ చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పుతో మరో అద్భుతమైన స్వీట్ కూడా తయారు చేయొచ్చని చాలా మందికి తెలియదు. అదే పెసర పప్పు హల్వా . ఇప్పుడు ఈ రెసిపీ తయారీ విధానం తెలుసుకుందాం.. ఇది హెల్తీ అండ్ టేస్టీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెసరపప్పు హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు పెసర పప్పు: పావు కిలో, షుగర్: ఒక కప్పు, ఫుడ్ కలర్: సరిపడ, కుంకుమ రేకులు: నాలుగు,యాలాకుల పొడి: అర చెంచా,నీళ్ళు: సరిపడ, నెయ్యి: ఒక కప్పు , డ్రై ఫ్రూట్ తురుము: మూడు స్పూన్లు,ఉప్మా రవ్వ: ఒక టేబుల్ స్పూన్. పెసర పప్పు హల్వా తయారీ విధానం పెసర పప్పు హల్వా కోసం ముందుగా తీసుకున్న పెసర పప్పును మూడు నుంచి నాలుగు గంటల పాటు నాన్ బెట్టుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన పప్పును మెత్తగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టీ దాంట్లో కొలతల ప్రకారం పంచదార, నీళ్ళు పోసి షుగర్ సిరప్ కోసం సిద్ధం చేసుకోవాలి. పంచడార కరిగిపోయి గట్టి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాంట్లో కుంకుమ పువ్వు నీళ్లను వేసుకోవాలి. లేదంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత షుగర్ సిరప్ లో మంచి టేస్ట్ కోసం యాలకుల పొడి వేసి.. కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. Also Read: Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..! ఆ తర్వాత ఇప్పుడు మరొక పాన్ స్టవ్ పై పెట్టీ దాంట్లో నెయ్యి , డ్రై ఫ్రూట్ వేసి బ్రౌన్ కలర్ మారే వరకు వేయించాలి. వేగిన తర్వాత వాటిని ఒక ప్లెట్లోకి వేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. ఆ తర్వాత ముందుగా మీక్షీ చేసి పెట్టుకున్న పెసర పప్పు పేస్ట్ ను దాంట్లో వేసుకొని సన్నని మంట పై ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత.. దీనిలో షుగర్ సిరప్ వేసి బాగా కలిపిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. చివరిగా దీని పై డ్రై ఫ్రూట్ వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. అదిరిపోయే యమ్మీ, టేస్టీ హల్వా రెడీ. Also Read: Vasthu Tips: ఇంట్లోకి రాగానే ఆందోళనగా అనిపిస్తుందా..? వాస్తు ఏం చెప్తుందో చూడండి #pesara-pappu-halwa-recipe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి