Health Tips: రోజూ ఈ పనులు చేస్తే.. శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ పెరుగుతాయి..!

శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ పెరగడానికి రోజు ఈ అలవాట్లను పాటించండి. స్వచ్ఛమైన గాలిని పీల్చడం, శారీరక వ్యాయామాలు, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శరీరంలో ఆక్సీజన్ లెవల్స్ కూడా పెరుగుతాయి.

Health Tips: రోజూ ఈ పనులు చేస్తే.. శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ పెరుగుతాయి..!
New Update

Health Tips: శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే.. శరీరానికి ఆక్సిజన్ చాలా అవసరం. అంతే కాదు శ్వాసక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ తక్కువైనప్పుడు బ్రెయిన్ కూడా చురుకుగా పని చేయదు. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి.

శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ పెంచడానికి సింపుల్ టిప్స్ 

కూర్చునే విధానం

మనం కూర్చునే భంగిమలు.. మనం తీసుకునే ఆక్సీజన్ లెవెల్స్ పై ప్రభావం చూపుతుంది. నిలబడిన, కూర్చున్నా నిటారుగా ఉండాలి. అలా చేయడం వల్ల ఊపిరితిత్తులు బాగా వ్యాపించి.. ఆక్సీజన్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అలాగే శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది.

శ్వాస సంబంధిత వ్యాయామాలు

శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి.. ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవడానికి సహాయపడుతుంది. ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ ను పెంచుతుంది.

Also Read: Parenting Tips: ఉదయం లేవగానే.. పిల్లలకు తప్పకుండా నేర్పాల్సిన అలవాట్లు..!

స్వచ్ఛమైన గాలిని పీల్చడం

ప్రకృతిలో స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కలుషితాలు లేకుండా.. స్వచ్ఛమైన గాలిలో ఆక్సీజన్ ఎక్కువగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ ను పెంచుతుంది.

శారీరక వ్యాయామాలు 

రోజు శారీరక వ్యాయామాలు చేయడం  వల్ల శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా చేయడం ద్వారా గుండె, శ్వాసకోశ వేగాన్ని పెంచి ఊపిరితిత్తుల పని తీరును మెరుగుపరుస్తుంది.  స్వచ్ఛమైన గాలిని పీల్చడం, శారీరక వ్యాయామాలు, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శరీరంలో ఆక్సీజన్ లెవల్స్ కూడా పెరుగుతాయి.

Also Read: Health Tips : భోజనం చేసాక ఈ 5 తప్పులు చేశారో…మీ పని ఫసక్..!!

#how-to-improve-oxygen-intake #tips-to-improve-oxygen-levels
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe