Health Tips: రోజూ చన్నీళ్లతో స్నానం చేస్తే ఆర్యోగానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా?!

చాలా మంది ప్రజలు వేడి నీటితో స్నానం చేస్తుంటారు. కానీ, ఉదయాన్నే చన్నీటితో స్నానం చేస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటికి బదులుగా చన్నీటితో స్నానం చేస్తే.. చర్మం, జుట్టుకు సంబంధించి అనేక ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. అంతేకాదు.. డిప్రెషన్ తో బాధపడేవారు కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చునని చెబుతున్నారు.

Health Tips: రోజూ చన్నీళ్లతో స్నానం చేస్తే ఆర్యోగానికి ఎన్ని ప్రయోజనాలు తెలుసా?!
New Update

Benefits of Cold Water Shower: రోజూ తలస్నానం చేయడం వల్ల శరీరం శుభ్రంగా ఉండటమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మనలో చాలా మందికి వేడి నీటితో స్నానం చేయడం అంటే ఇష్టం . ముఖ్యంగా చలికాలంలో చల్లటి నీళ్లలో స్నానం చేయడాన్ని ఊహించలేం. అయితే వేడి నీళ్లకు బదులు చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తున్నారు.

చల్లటి నీటితో స్నానం చేసిన తర్వాత కాసేపు వణుకు పుట్టినా.. ఇది చర్మం, జుట్టు రెండింటికీ చాలా ప్రయోజనాలను కలిగిస్తుందని చెబుతున్నారు. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. చర్మం మంటను తగ్గిస్తుంది. చల్లటి నీళ్లలో ఓదార్పు గుణాలు ఉన్నాయి. సున్నితమైన చర్మానికి చన్నీళ్లు సరైన ఎంపిక. రోసేసియా, ముఖంపై ఎర్రటి మచ్చలు వంటి చర్మ సమస్యలు ఉన్నవారు చల్లని నీటితో స్నానం చేస్తే ఫలితం ఉంటుంది..

2. చర్మ రంధ్రాలు బిగుతుగా మారతాయి. మంచి ఛాయ కోసం తహతహలాడే వారికి చన్నీటితో స్నానం లాభదాయకంగా ఉంటుంది. చల్లని నీటి కారణంగా తాత్కాలికంగా రంధ్రాలను బిగించుకుపోయే, కుదించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

3. మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టు కోసం చల్లని నీటి స్నానం సహాయపడుతుంది. వేడి నీరు జుట్టులోని సహజ నూనెలను తీసివేస్తుంది. కానీ చల్లని నీరు జుట్టుకు రక్షణగా పనిచేస్తుంది. ఇది హెయిర్ క్యూటికల్‌ను సీల్ చేస్తుంది. ఫలితంగా మృదువైన, మెరిసే జుట్టు ఉంటుంది.

4. దురదను తగ్గిస్తుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే దురద సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. తామర లేదా పేను వంటి సమస్యలకు చల్లని స్నానంతో  చెక్ పెట్టొచ్చు.

5. శిరోజాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వలన శిరోజాల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది దురద, చికాకు కలిగించే స్కాల్ప్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ, అతి చల్లని నీటితో ఒకేసారి స్నానం చేయకూడదు. ముందుగా గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఆ తరువాత చల్లటి నీళ్లలో స్నానం చేయాలి.

అంతేకాదండోయ్.. ఇటీవల జనాదరణ పొందుతున్న సంపూర్ణ చికిత్సా పద్ధతి హైడ్రోథెరపీ. వారానికి 2 నుండి 3 సార్లు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల డిప్రెషన్ లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు. డిప్రెషన్‌తో బాధపడేవారికి చన్నీటితో స్నానం తేలికపాటి ఎలక్ట్రోషాక్ థెరపీ రూపంలో పనిచేస్తాయి. చల్లటి నీరు మెదడుకు విద్యుత్ ప్రేరణలను కలిగిస్తుంది. ఈ సమయంలో ఎండార్ఫిన్లు, కొన్నిసార్లు సంతోషకరమైన హార్మోన్లు ప్రేరేపితం అవుతాయి.

స్థూలకాయులు వారానికి 2 లేదా 3 సార్లు చన్నీటితో స్నానం చేయడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది కాలక్రమేణా ఊబకాయంతో పోరాడటానికి సహాయపడుతుంది. చన్నీటి జల్లులు శరీర బరువు తగ్గడానికి ఎలా సహాయపడతాయనే దానిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, మీరు అనారోగ్యంతో ఉంటే, ఇటీవల ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినట్లయితే లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉంటే చల్లటి నీటితో స్నానం చేయవద్దు. చల్లటి నీటితో స్నానం చేయడం చాలా మందికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, మన శరీరాలు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది.

#benefits-of-cold-water-shower
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe