Fiber Intake: మోతాదుకు మించి ఫైబర్ తీసుకుంటే.. ఆరోగ్యానికి ప్రమాదం..!

శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఫైబర్ ఒకటి. ఫైబర్ జీర్ణక్రయ, కొవ్వును నిర్వహించడంలో సహాయపడును. ఇది సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం. కానీ మోతాదుకు మించి తీసుకుంటే తీసుకుంటే గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం, పోషకాహార లోపం సమస్యలు వస్తాయి.

New Update
Fiber Intake: మోతాదుకు మించి ఫైబర్ తీసుకుంటే.. ఆరోగ్యానికి ప్రమాదం..!

Fiber Intake: ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచిదనీ వైద్య నిపుణులు చెబుతున్నారు. పోషకాహార నివేదికల ప్రకారం రోజులో ఆడవాళ్ళు 25gr మగవాళ్ళు 38gr మోతాదులో ఫైబర్ తీసుకోవాలి. యాపిల్, తృణ ధాన్యాలు, డ్రై ఫ్రూట్, ఓట్స్, క్యారెట్, బీట్ రూట్, కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ శరీరానికి కావల్సిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కానీ మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు కొన్ని సార్లు సడెన్ గా ఫైబర్ శాతం పెంచిన సమస్యలు వస్తాయి.

మోతాదుకు మించి ఫైబర్ తీసుకుంటే కలిగే సమస్యలు

గ్యాస్, కడుపుబ్బరం

రోజూ తినే ఆహారంలో మోతాదుకు మించి ఫైబర్ తీసుకుంటే అది జీర్ణ క్రియ పై ప్రభావం చూపుతుంది. గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలను కలిగించును. అధిక మోతాదు మాత్రమే కాదు ఒక్కసారిగా ఫైబర్ ఇంటెక్ పెంచిన కూడా ఈ సమస్యలు వస్తాయి. మెల్లిగా డోస్ పెంచుతూ పోవాలి.

బరువు పెరగడం

సడెన్ గా రోజు తినే ఆహారంలో ఫైబర్ శాతం పెంచినప్పుడు, ముఖ్యంగా డైట్ లో ఫైబర్ తో పాటు సరైన సరైన నీళ్లు తీసుకున్నప్పుడు కడుపుబ్బరం కలిగి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా ఫైబర్ తింటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది కానీ మోతాదుకు మించి తీసుకుంటే కడుపు ఉబ్బిపోయి బరువు పెరిగామనే భావనను కలిగించును.

మలబద్దకం

డైట్ లో కావాల్సిన కంటే అధిక మోతాదులో తీసుకుంటే పేగులకు అడ్డుపడి.. మోషన్ ఫ్రీగా అవ్వకుండా చేస్తుంది. దీని వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. అదే సరైన మోతాదులో తీసుకుంటే మలబద్దకాన్ని తగ్గించును. ఏ ఆహారమైన కావాల్సినంత తింటేనే ఆరోగ్యం లేదంటే విషం.

పోషకాహార లోపం

అధిక ఫైబర్ పోషకాహార లోపానికి కారణమవుతుంది. ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం పోషకాల శోషణకు భంగం కలిగించును. అందుకే తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపుతుంది.

Also Read: Weight Loss: మీ డైట్ లో వీటిని చేర్చితే ఈజీగా బరువు తగ్గుతారు.. ఎలానో తెలుసా..?

Advertisment
తాజా కథనాలు