/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-30T180537.207-jpg.webp)
Re-Heating Oil: FSSAI (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నివేదిక ప్రకారం ఒకసారి వాడిన వంట నూనెను మళ్ళీ హీట్ చేయడం ద్వారా దానిలో కొన్ని విషపూరితమైన పదార్థాలు విడుదలవుతాయి. వీటి కారణంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరిగిపోయి.. అవి వాపు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తాయి. అసలు ఆయిల్ రీ హీట్ చేయడం ద్వారా కలిగే అనారోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
Also Read: Heeramandi: 1000 డ్రోన్లు.. కళ్ళు జిగేలుమనేలా.. ‘హీరమండి’ రిలీజ్ డేట్ రివీల్
రక్తపోటు
నూనెను పదే పదే వేడి చేయడం ద్వారా విషపూరిత సమ్మేళనాలు ఏర్పడతాయి. ఇవి శరీరంలో రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్, ఆక్సీకరణ ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
జీర్ణక్రియ సమస్యలు
ఒకసారి వాడిన వంట నూనెను మరో సారి వాడడం తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తుంది. ముఖ్యంగా జీర్ణక్రియ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఎసిడిటీ, కడుపులో మంట, గొంతు సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. ముందు నుంచే ఎసిడిటీ సమస్య ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
కొలెస్ట్రాల్ స్థాయిలు
వంట నూనెను తిరిగి మళ్ళీ ఉపయోగించినప్పుడు వాటిలోని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ పరిమాణం పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంచి కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్స్ గా మారతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి అనారోగ్యకరమైన కొవ్వులు. ఇవి గుండె సంబంధిత వ్యాధులను పెంచే ప్రమాదం ఉంటుంది.
క్యాన్సర్
వంట నూనెలను మళ్ళీ వేడి చేయడం వల్ల క్యాన్సర్ కు కారణమయ్యే కార్సినోజెనిక్ కాంపౌండ్స్ పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు (PAH) ఆల్డిహైడ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.