Prawns: రొయ్యలు అంటే ఇష్టమా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి

చాలా మంది ఫిష్ ఐటమ్స్ బాగా ఇష్టంగా తింటారు. వాటిలో ముఖ్యంగా రొయ్యలు. రొయ్యలు టేస్టీగా మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు అధిక బరువు, ఎముకల దృఢత్వం, చర్మ ఆరోగ్యం, అల్జీమర్స్ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.

New Update
Prawns: రొయ్యలు అంటే ఇష్టమా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి

Prawns: వెజ్ ఐటమ్స్ తో కంపేర్ చేస్తే చాలా మంది నాన్ వెజ్ ఐటమ్స్ తినడానికి చాలా ఇష్టపడతారు. నాన్ వెజ్ లో చికెన్, మటన్, ఫిష్ ఇలా చాలా రకాల డిషేస్ ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో రొయ్యలు, పీతలు , కొఱ్ఱమీను, అపోలో ఫిష్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి. వీటిలో రొయ్యలు మరింత టేస్టీ గా ఉంటాయి. ఇవి రుచిగా మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

రొయ్యలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

చర్మ ఆరోగ్యం

రొయ్యలు విటమిన్ E పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి సహాయపడతాయి. ముడతలు, డ్రై నెస్, వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయి.

ఆరోగ్య సమస్యలను తగ్గించును

వీటిలోని విటమిన్ B12 నిరాశ, బలహీనత, నీరసం, డిప్రెషన్ వంటి ఆరోగ్య, మానసిక సమస్యలను తగ్గిస్తాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు వారి ఆహారంలో రొయ్యలు తీసుకోవడం మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

Also Read: Mental Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ మానసిక ఆరోగ్యం బాగాలేదని సూచన..!

publive-image

బరువు తగ్గడం

సాధారణంగా రొయ్యల్లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి అధిక బరువు సమస్య ఉన్నవారికి సరైన ఎంపిక. తక్కువ కేలరీ కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతే కాదు వీటిలోని సెలోనియం కాంపౌండ్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించును.

అల్జీమర్స్ వ్యాధిని తగ్గించును

రొయ్యల్లోని ఫ్యాట్స్ లో ఉండే ఆమ్లం అల్జీమర్స్ వ్యాధిపై తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే వీటిలోని జింక్, క్యాల్షియం వంటి మినరల్స్ రోగనరోధకశక్తి , ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి.

Also Read: Mental Health: నిరంతర ఆలోచనలు మీ శరీరాన్ని ప్రభావితం చేస్తాయని తెలుసా? ఇలా చేసి చూడండి!

Advertisment
Advertisment
తాజా కథనాలు