Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

చికెన్ లివర్ కొంత మంది ఇష్టంగా తింటారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ A, ఐరన్, జింక్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త హీనత, ఎముకల బలహీనత, కళ్ళు, చర్మం, జుట్టు సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

New Update
Chicken Liver: చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

Chicken Liver:  చికెన్, మటన్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది. నాన్ వెజ్ ఐటమ్స్ అనగానే నోట్లో నీళ్లు వస్తాయి. మ్యుఖ్యంగా చికెన్ లవర్స్ ఎక్కువగా ఉంటారు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, గ్రేవీ, చికెన్ మంచూరియా, చికెన్ కబాబ్స్, చికెన్ 65 ఇలా చికెన్ తో తయారు చేసే ప్రతీ చాలా ఇష్టంగా తింటారు. చికెన్, మటన్ మాత్రమే కాదు దాంట్లో సెపెరేట్ పార్ట్స్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. లివర్, బ్రెయిన్, బోన్స్ ఇలా ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం ఉంటుంది. వీటిలో చికెన్ లివర్ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది టేస్టీ మాత్రమే కాదు హెల్తీ కూడా. చికెన్ లివర్ తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలా అని అతిగా తింటే కూడా ఆరోగ్యానికి ప్రమాదం. ఏదైన పరిమితిలో తింటేనే ఆరోగ్యం. లివర్ తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...

చికెన్ లివర్ ఆరోగ్య ప్రయోజనాలు

పుష్కలమైన పోషకాలు

లివర్ పుష్కలమైన పోషకాలు కలిగిన ఆహారాల్లో ఒకటి. దీనిలో ఐరన్, రిబోఫ్లేవిన్, విటమిన్ B12, విటమిన్ A, కాపర్, ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి, చర్మ, రక్త హీనత సమస్యలను తగ్గిస్తాయి.

రక్త హీనతను తగ్గించును

రక్తంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి ఐరన్ చాలా మ్యుఖ్యం. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత, నీరసం, కండరాళ్ళ బలహీనత ఏర్పడతాయి. రక్త హీనత సమస్య ఉన్నవారి ఆహారంలో లివర్ చేర్చడం సరైన ఎంపిక. దీనిలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఐరన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం ద్వారా రక్త కణాలను పెంచుతుంది. ఆహారంలో దీన్ని తీసుకుంటే రక్త హీనత తగ్గించడానికి సహాయపడుతుంది.

Also Read: Mobile: చార్జింగ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు..!

publive-image

ఎముకల దృఢత్వాన్ని పెంచును

లివర్ లో విటమిన్ K అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మ్యుఖ్యం. విటమిన్ K క్యాల్షియం శోషణను పెంచి.. ఎముకల దృఢత్వానికి సహాయపడుతుంది. డైట్ లో లివర్ తీసుకుంటే.. విటమిన్ K లోపం కారణంగా వచ్చే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అంతే కాదు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

శక్తి , మెదడు పనితీరును మెరుగుపరుచును

దీనిలోని విటమిన్ B12 ఆరోగ్యకరమైన నాడి వ్యవస్థకు తోడ్పడుతుంది. జ్ఞాపకశక్తి, నిరాశ, అయోమయం, చిరాకు వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి లివర్ బెస్ట్ ఆప్షన్. లివర్ లోని అధిక విటమిన్ B12 మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది.

Also Read: Break Fast: నూనె లేకుండా ఈ అల్పాహారం ట్రై చేయండి.. ఆరోగ్యంగా ఉంటారు

Advertisment
Advertisment
తాజా కథనాలు