Mud Pot: మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అందులో భాగమే మనం తాగే మంచినీళ్లు కూడా. ఇంకా చెప్పాలంటే, ఆహారం కంటే కూడా నీళ్లు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఆహారం లేకుండా కొన్ని వారాలపాటు జీవించగలం. కానీ, నీళ్లు తాగకపోతే రెండు రోజులు కూడా బతకడం కష్టం. చాలా మంది ఎండాకాలం వచ్చిందంటే ఫ్రిజ్ వాటర్ తాగడానికి ఇష్టపడతారు కానీ, దానికి బదులు చల్లని కుండలో ఉన్న నీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఓసారి తెలుసుకుందామా..
చల్లని మట్టి కుండలో నీళ్లు తాగితే కలిగే ప్రయోజనాలు :
వేడి నుండి రక్షణ
చల్లని కుండ నీరు ఎండకాలంలో వేడి నుండి రక్షించడానికి సహాయపడుతుంది. మట్టి పాత్రలలో నీటిని ఉంచడం ద్వారా, నీటిలోని విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తాయి. దీని వల్ల శరీరం చల్లదనాన్ని పొందుతుంది.
సహజ శీతలీకరణ లక్షణాలు
మట్టి కుండలో నీటిని నిల్వ చేయడం వల్ల నీటి సహజ శీతలీకరణకు సహాయపడుతుంది. మట్టికుండ ఉపరితలంపై చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది. ఈ రంధ్రాల ద్వారా నీరు త్వరగా ఆవిరైపోతుంది. ఈ సహజ శీతలీకరణ ప్రభావం ముఖ్యంగా వేడి వేసవి నెలలలో చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది, ఇది నీటి ఉష్ణోగ్రతను తగ్గించి నీరు చల్లగా ఉండేలా చేస్తుంది.
జీవక్రియను పెంచుతుంది
ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ ఉంచిన నీటిని తాగినప్పుడు బిస్ ఫినాల్ ఎ లేదా బిపిఎ వంటి విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఇది శరీరంలో టెస్టోస్టెరోన్ స్థాయిలను తగ్గిస్తుంది. మట్టికుండలోని నీరు త్రాగడం టెస్టోస్టెరాన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. శరీరం యొక్క జీవక్రియను పూర్తిగా మెరుగుపరుస్తుంది.
వడదెబ్బను నివారిస్తుంది
ఎండాకాలంలో వడదెబ్బ అనేది చాలా సాధారణ సమస్య. మట్టి కుండలో నిల్వ ఉంచిన నీళ్లు తాగితే వడదెబ్బను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది, చల్లని మట్టి కుండ నీటిలో ఖనిజాలు ,పోషకాల పుష్కలంగా ఉంటాయి
ఆరోగ్యం
ఫ్రిజ్ లో ఉంచిన నీళ్లు తాగితే.. గొంతు పట్టేయడం, గొంతు నొప్పి సమస్యలు రావచ్చు. మట్టి కుండ నీరు సరైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. దగ్గు జలుబు ఉన్నవాళ్లు మట్టి కుండా నీటిని తాగడం ఎంతో మేలు.
సహజ శుద్ధి
మట్టి కుండ నీటిని చల్లబరచడానికి మాత్రమే కాదు నీటిని సహజంగా శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. మట్టి కుండలోని నీళ్లు కలుషితాలను అడ్డుకుంటాయి.
త్రాగడానికి సురక్షితం
ఫ్రిజ్ లో నీళ్లు తాగడం కంటే మట్టి కుండలోని నీటిని తాగడం ఎంతో మేలు. మట్టి కుండలలో నిల్వ చేయడం ద్వారా నీటిని సమృద్ధిగా ఉంచడంతో పాటు పాటు కలుషితాలను తొలగిస్తుంది. అందుకే మట్టి కుండ నీళ్లు త్రాగడానికి సురక్షితం.
Also Read: Basmati Rice : బాస్మతి రైస్ తింటే.. ఇంత మేలు జరుగుతుందా..!