Milk: పాలను వీటిలో కలిపి తాగితే.. ఎన్ని లభాలో తెలుసా పాలను బూస్ట్ లేదా హర్లిక్స్ లో కలిపి తాగడం సహజం. కానీ దీనిలోని పోషక విలువలను మరింత పెంచడానికి పసుపు, ఆంజీర్, వాల్నట్స్, బాదంతో మిక్స్ చేసి తాగండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి మరింత బలాన్ని ఇస్తాయి. By Archana 06 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Milk: సహజంగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ వారి రోజూ దినచర్యలో పాలు తాగే అలవాటు ఉంటుంది. పాలలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B2, విటమిన్ B12, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ A,D అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, ఎముకల దృఢత్వం, జీర్ణక్రియ మెరుగుపడుటకు సహాయపడతాయి. పాలలో మరిన్ని పోషక విలువలను పెంచడానికి.. వాటిలో డ్రై ఫ్రూట్స్ కలిపి తాగండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటిలోని పోషకాలు రోగ నిరోధక శక్తి, మెదడు , జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంజీర్ మిల్క్ పాలలో అంజీర్ కలిపి తాగితే మరింత ఆరోగ్యం. అంజీర్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఎ, విటమిన్-సి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచ్.. ఇన్ఫెక్షన్స్, వ్యాధులు రాకుండా కాపాడుతాయి. Also Read: Tea In Paper Cups: పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి బాదం మిల్క్ నాన బెట్టిన బాదం పాలలో కలిపి మిక్షీ వేసి తాగితే శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి. బాదంలోని విటమిన్ E చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ మెదడు ఆరోగ్యం, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. పసుపు పాలు సాధారణ పాల కంటే పసుపు పాలతో మరిన్ని లాభాలు పొందొచ్చు. పాలలో పసుపు కలిపి తాగితే జలుబు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలకు మంచి పరిష్కారం. వీటిలోని యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి ఆక్సిడెంట్స్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పడుకునే ముందు పసుపు పాలు తాగితే నిద్ర కూడా బాగా పడుతుంది. Also Read: Diabetic Health: షుగర్ ఉన్నవారు ఖర్జూరాలు తింటున్నారా.. ఏమవుతుందో తెలుసా..! #benefits-of-drinking-milk-with-dry-fruits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి