celery juice: ఈ జ్యూస్ తాగితే.. మీ ఆరోగ్యానికి ఏ బాధ ఉండదు.. ట్రై చేయండి

కొంత మంది ఆకుకూరలను పక్కన పెట్టేస్తుంటారు. వాటిలో ఒకటి సెలెరీ. దీని జ్యూస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.సెలెరీలోని హై వాటర్ కంటెంట్ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. దీనిలోని పోషకాలు రక్తపోటు, బరువు, ఇన్ఫెక్షన్స్, జీర్ణక్రియ సమస్యలను తగ్గించును.

New Update
celery juice: ఈ జ్యూస్ తాగితే.. మీ ఆరోగ్యానికి ఏ బాధ ఉండదు.. ట్రై చేయండి

celery juice: సెలెరీ అనేది గ్రీన్ లీఫీ వెజిటేబుల్. సాధారణంగా కొంత మంది ఆకుకూరలు తినడానికి అంతగా ఇష్టపడరు. ఇంక ఆకుకూరల జ్యూస్ అంటే అసలే తాగారు. ఆసుకూరలతో తయారు చేసే జ్యూసెస్ రుచిగా ఉండకపోయిన ఆరోగ్యానికి చాలా మంచిది. వాటిలో ఒకటి సెలరీ జ్యూస్. దీనిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. జ్యూస్ లేదా సూప్స్ చేయడానికి సెలరీ ఎక్కువగా వాడతారు. దీనిలో హై వాటర్ కంటెంట్, విటమిన్ K , C, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ మీ డైట్ లో సెలరీ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి కలిగే మరిన్ని లాభాలేంటో చూద్దాం..

సెలరీ జ్యూస్ తో ఆరోగ్యానికి కలిగే లాభాలు

శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది

దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అలాగే శరీరంలో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. రోజూ డైట్ సెలరీ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

యాంటీ ఇన్ఫలమేటరి గుణాలు

సెలరీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ ఇన్ఫలమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో మంట, ఇన్ఫెక్షన్స్, గాయాలను తగ్గించడానికి తోడ్పడతాయి. అంతే కాదు యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బారి నుంచి రక్షిస్తాయి.

Also Read: Blue Light Effects: బ్లూ లైట్ నుంచి కంటిని రక్షించే టిప్స్ .. తప్పక తెలుసుకోండి

publive-image

జీర్ణక్రియ ఆరోగ్యం

రోజూ డైట్ లో ఈ జ్యూస్ తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపి.. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే దీనిలోని అధిక ఫైబర్ బోవేల్ మూమెంట్ ఫ్రీగా అవ్వడానికి సహాయపడుతుంది. దీంతో మలబద్దకం, కడుపుబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

రక్తపోటును తగ్గించును

సెలరీ ఆకుల్లో థాలైడ్స్ అనే కాంపౌండ్స్ శరీరంలో అధిక రక్తపోటును తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే దీనిలోని హై ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నిర్వహించడం, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచును

దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి.. చర్మం ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తాయి . అలాగే హై వాటర్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

Also Read: Skin Fasting: స్కిన్ ఫాస్టింగ్.. ఎప్పుడైనా విన్నారా..? దీంతో మీ చర్మం మరింత యవ్వనం

Advertisment
Advertisment
తాజా కథనాలు