Ash Gourd Juice: వామ్మో.. గుమ్మడికాయ జ్యూస్ తాగితే ఇన్ని ఆరోగ్య లాభాలా..!

ఆకుకూరలు, కూరగాయలతో చేసిన జ్యూస్ చాలా మంది తాగడానికి ఇష్టపడరు. కానీ కూరగాయలలో గుమ్మడికాయతో చేసిన జ్యూస్ తాగితే బరువు పెరగడం, జీర్ణక్రియ, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయును.

New Update
Ash Gourd Juice: వామ్మో.. గుమ్మడికాయ జ్యూస్ తాగితే  ఇన్ని ఆరోగ్య లాభాలా..!

Ash Gourd Juice: చాలా మంది ఫ్రూట్ జ్యూసెస్ మాత్రమే ఎక్కువగా తాగుతుంటారు. ఆకు కూరలు, కూరగాయలతో చేసిన వాటిని తాగడానికి అంతగా ఇష్టపడరు. ఫ్రూట్ జ్యూసెస్ తో పోల్చుకుంటే ఇవి పెద్దగా రుచిగా ఉండవు అందుకే వీటిని తాగడానికి ఇష్టం చూపించరు. కానీ ఆకుకూరలు, కూరగాయల తో చేసిన జ్యూసెస్ ఆరోగ్యానికి చాలా లాభాలను ఇస్తాయి. వాటిలో ముఖ్యంగా గుమ్మడి కాయ.. దీనిని చాలా మంది కర్రీ గా తినడానికే ఇష్టపడరు.. ఇంక దీనితో జ్యుస్ అంటే.. అసలే తాగారు. కానీ ఇది తాగితే ఆరోగ్యానికి చాలా మేలు. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి అవగాహన ఉన్న వారు మాత్రమే వీటిని తీసుకుంటారు.

publive-image

గుమ్మడికాయ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

  • బరువు తగ్గాలని ఆశపడే వారికి ఈ గుమ్మడికాయ రసం ఒక మంచి ఎంపిక. దీనిలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
  • గుమ్మడికాయలో నీటి శాతం అధికంగా ఉండును. ఈ గుమ్మడి కాయ జ్యూస్ తాగడం వల్ల శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చేయును.
  • గుమ్మడి కాయతో చేసిన జ్యూస్ తాగితే జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియ సమస్యలను కూడా దూరం చేయును. జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు దీనిని తీసుకోవడం చాలా మంచింది.
  • అలాగే గుమ్మడికాయలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని వ్యర్థాలను, విషపూరితలను బయటకు పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచును.
  • ఆయుర్వేదం ప్రకారం గుమ్మడికాయ జ్యూస్ ఆస్తమా, దగ్గు, వంటి శ్వాస సంబంధిత వ్యాధులను నయం చేయడంలో సహాయం చేయును.
  • గుమ్మడికాయ జ్యూస్ నాడి వ్యవస్థ పై మంచి ప్రభావాన్ని చూపి.. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడును.
  • అంతే కాదు గుమ్మడికాయలోని విటమిన్ 'సి', యాంటీ ఆక్సిడెంట్స్ ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుచును. అందుకని రోజు తినే ఆహారంలో దీనిని చేర్చితే ఆరోగ్యానికి చాలా లాభాలు చేకూరుతాయి.

Also Read: Lung Health: వీటిని తాగితే.. మీ ఊపిరితిత్తులకు ఏ బాధ ఉండదు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు