Cucumber Seeds: దోసకాయ గింజలు తింటే.. ఇన్ని లాభాల..!

దోసకాయ తింటే ఆరోగ్యానికి చాలా లాభాలు. ఈ విషయం అందరికి తెలిసిందే. దోసకాయ మాత్రమే కాదు వీటి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అధిక నీరు, ఫైబర్ , మినరల్స్ ఉంటాయి. రోజూ ఇవి తింటే యూరినరీ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లను నియంత్రించును.

New Update
Cucumber Seeds: దోసకాయ గింజలు తింటే.. ఇన్ని లాభాల..!

Cucumber Seeds: సాధారణంగా దోసకాయలో అధిక నీటి శాతం ఉండును. ఒక్క కప్పు దోసకాయ ముక్కలు తీసుకుంటే రోజులో శరీరానికి కావాల్సిన 14% నుంచి 19% విటమిన్ K అందును. అంతే కాదు వీటిలో విటమిన్ 'B, C పోషకాలు, కాపర్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతీ రోజు మన ఆహారంలో దోసకాయను తింటే వీటిలోని అధిక నీటి శాతం జీవన శైలి వ్యాధులకు మెరుగ్గా ఉపయోగపడును. రక్తంలోని చక్కర స్థాయిలు, మలబద్దకం, అధిక బరువు సమస్యలను నియంత్రించడానికి సహాయపడును. దోసకాయ మాత్రమే కాదు వీటి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దోసకాయ సీడ్స్ మన డైట్ లో అలవాటు చేసుకుంటే కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో చూడండి.

బరువు తగ్గించడం

అధిక బరువు తగ్గాలని ఆశించే వారికి దోసకాయ గింజలు సరైన ఎంపిక. వీటిని రోజూ డైట్ లో తీసుకుంటే బరువు తగ్గడం సులువుగా మారును. ఈ సీడ్స్ లోని ఎక్కువ వాటర్ కంటెంట్, మినరల్స్ శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడును. అంతే కాదు ఇవి తక్కువ కెలరీలను కలిగి ఉండును.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గించును

దోసకాయ గింజలు మూత్రాశయ ఇన్ఫెక్షన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ను దూరం చేయడంలో సహాయపడును. మూత్రాశయంలో మంట సమస్య ఉన్నవారికి దోసకాయ సీడ్స్ మంచి ప్రభావం చూపును. 15 నుంచి 30 రోజులు ప్రతీ రోజూ ఈ గింజలు అలాగే దోసకాయ జ్యుస్ తాగితే కొంత వరకు ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

చర్మ సౌందర్యం పెంచును

వాతావరణంలో కాలుష్యం కారణంగా చర్మ సమస్యలు ఎక్కువగా వస్తాయి. చర్మం పొడిబారడం, ముడతలు, ట్యాన్ అవ్వడం జరుగుతుంది. దోసకాయ సీడ్స్ తింటే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా చేయును.

కిడ్నీ స్టోన్స్ తొలగించును

కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్న వారికి దోసకాయ గింజలు ఒక వరం. రోజూ వీటిని తీసుకుంటే కిడ్నీలో రాళ్లును తొలగించును. వీటిని పొడి లేదా నీళ్లలో వేసి జ్యూస్ లా కూడా తీసుకోవచ్చు.

క్యాన్సర్ కు కారణమయ్యే సెల్స్ ను తగ్గించును

దోసకాయ గింజల్లోని ఫైటో ఎలిమెంట్స్ క్యాన్సర్ సెల్స్ అభివృద్ధిని నిరోదించును. వీటిని రోజూ తీసుకుంటే శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావాన్ని నియంత్రించును. వీటిలోని ఫైబర్, మినరల్స్ శరీరంలో నీరసాన్ని తగ్గించును.

Amla Benefits : ఉసిరి జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే! - Rtvlive.com

Advertisment
Advertisment
తాజా కథనాలు