Crime News: దారుణం.. భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య..!
హైదరాబాద్ హయత్ నగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ బంధువులు ఆరోపిస్తూ ధర్నా చేపట్టారు. ఈ కారణంగా విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Hayathnagar : హైదరాబాద్ హయత్ నగర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంది. గతేడాది మేలో సుజాత అనే యువతికి, శివ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఓ పాప కూడా ఉంది. అయితే, భార్య సుజాతను భర్త అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులు భరించలేకే ఇంట్లో ఎవరు లేని సమయంలో సుజాత ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు అంటున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సుజాత ఆత్మహత్యపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. నిందితులకు పోలీసులు సహకరిస్తున్నారని పోలిస్ స్టేషన్ ముందు బంధువులు ధర్నా చేపట్టారు. ధర్నా కారణంగా విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.