Harsha Bhogle: హర్షా భోగ్లే మొదటి పే చెక్‌ ఫొటో వైరల్‌.. మీరు తోపు సర్..!

వ్యాఖ్యాతగా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న హర్షా భోగ్లేకు క్రికెట్ లవర్స్‌ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా దురదర్శన్‌లో ప్రసారమైన మొదటి వన్డే మ్యాచ్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన పే స్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు హర్షా. ఆ పే చెక్‌లో హర్షా జీతం రూ.350 అని ఉంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 40 సంవత్సరాల తర్వాత ఆ యువకుడు క్రికెట్‌కు వాయిస్‌గా మారాడని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.

New Update
Harsha Bhogle: హర్షా భోగ్లే మొదటి పే చెక్‌ ఫొటో వైరల్‌.. మీరు తోపు సర్..!

Harsha Bhogle Shares Pic Of His First Pay Cheque: హర్షా భోగ్లే క్రికెటర్‌ కాదు.. అయినా ఆయనకు క్రికెట్‌పై ఉన్న నాలెడ్జ్‌ అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు ఏ మాత్రం తీసిపోదు. చాలా మంది క్రికెటర్లు రిటైర్‌మెంట్ తర్వాత కామెంటరీ బాట పడతారు. కానీ హర్షా మాత్రం ప్రొఫెషనల్‌ కామెంటేటర్‌.. చాలా న్యూట్రల్‌గా కామెంటరీ చేస్తారు హర్షా. అటు సెటైరికల్‌గా కూడా పంచ్‌లు వేయడంలో హర్షా దిట్ట. ఇక ఆయన క్రికెట్‌ నంబర్స్‌ గురించి మాట్లాడేటప్పుడు అంతా ఆశ్చర్యపోతారు. ఆయన బ్రెయిన్‌లోనే క్రికెట్ స్టాట్స్‌ పాతుకుపోయి ఉంటాయి. ఆయనకున్న యూనిక్‌ స్పెషాలిటీ అది. క్రికెట్ గాడ్‌ సచిన్‌ స్ట్రైట్‌ డ్రైవ్‌ని హర్షా కంటే బెటర్‌గా ఎవరూ వర్ణించరు. అంతటి క్లాసిక్‌ కామెంటేటర్‌ హర్షా. ఆయన కామెంటరీ మొదలు పెట్టి ఇవాళ్టి(సెప్టెంబర్‌ 12)తో 40ఏళ్లు. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో హర్షా చేసిన పోస్టు తెగ వైరల్‌ అవుతోంది.


40 సంవత్సరాల క్రితం:
1983లో హైదరాబాద్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో భోగ్లే తొలిసారి కామెంట్రీ బాధ్యతలు చేపట్టారు. దూరదర్శన్ నుంచి అందుకున్న ఆహ్వానం ఫొటోను షేర్ చేశారు. '40 సంవత్సరాల క్రితం ఈరోజు నా మొదటి వన్డే కామెంటరీ.. ఇప్పటికీ ఇప్పటికీ ఆ యువకుడు అవకాశాలను పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని గుర్తుంచుకోండి. డీడీ-హైదరాబాద్‌ నుంచి నాకు అప్పుడు ఆహ్వనం అందింది.' అని భోగ్లే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మ్యాచ్ సమయం, వ్యవధితో పాటు ఫొటోను షేర్ చేశారు. క్రికెట్ వ్యాఖ్యాతగా తాను తొలి అందుకున్న జీతం 350 రూపాయలని చెప్పాడు.

వైరల్‌గా మారిన పోస్ట్:
హర్షా భోగ్లే ఇలా పోస్టు పెట్టారో లేదో అది క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. హర్షా ఫాలోవర్లు ఆయన పట్ల ప్రేమ, ప్రశంసలను కురిపించారు. పోస్ట్‌పై స్పందిస్తూ, "40 సంవత్సరాల తర్వాత ఆ యువకుడు క్రికెట్‌కు వాయిస్‌గా మారాడు" అని ఒక నెటిజన్ రాశారు. మరొకరు 'ఫుట్‌బాల్‌లో పీటర్ డ్రూరీ, క్రికెట్‌లో హర్షా భోగ్లే' అని రాశారు. 'దూరదర్శన్ ఒక రత్నాన్ని అందించినందుకు ధన్యవాదాలు' అని మరోకరు కామెంట్ చేశారు. 'మీరు క్రాఫ్ట్‌ను అత్యున్నంగా ఎలివేట్ చేశారు' ఒక భారతీయుడిగా, తోటి హైదరాబాదీగా, క్రికెట్ పట్ల ప్రేమ ఉన్న వ్యక్తిగా, మీ కామెంటరీ వినడం అదృష్టంగా భావిస్తున్నాను. మీరు, రిచీ బెనాడ్ క్రికెట్ వ్యాఖ్యాతల పాంథియోన్‌లో లెజెండ్‌లుగా నిలిచారు' అని కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ: అల్లుడు రాక్…మామ షాక్..!!

Advertisment
తాజా కథనాలు