Friendship day: ఇలా చేయండి.. దూరంగా ఉన్న మీ బెస్ట్ ఫ్రెండ్‌ మీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది!

ఫ్రెండ్‌షిప్‌ డే నాడు మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ మీకు దూరంగా ఉన్నాడని బాధపడొద్దు. ఆన్‌లైన్‌ ద్వారా మీ ఫ్రెండ్‌ మీతోనే ఉన్నట్టు థ్రిల్‌ చేసే అనేక మార్గాలున్నాయి. ఈ ఐడియాలను షేర్ చాట్‌ క్రియేటర్‌ నేహా పర్మార్ సోషల్‌మీడియాలో పంచుకున్నారు. వీడియో కాల్‌ల ద్వారా కలిసి వంట చేయడం, మెయిల్స్‌ సెండ్‌ చేయడం, వర్చువల్‌గా మీట్ అవ్వడం, వాచ్ పార్టీ, కలిసి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడడం లాంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

Friendship day: ఇలా చేయండి.. దూరంగా ఉన్న మీ బెస్ట్ ఫ్రెండ్‌ మీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది!
New Update

మీ బెస్ట్ ఫ్రెండ్‌ మీకు చాలా దూరంగా ఉన్నాడని/ఉందని బాధపడుతున్నారా? ప్రతి ఏడాది ఫ్రెండ్‌షిప్‌ డేకి కలిసే మీ స్నేహితుడు ఈసారి మీకు అందుబాటులో ఉండడం లేదా..? అయితే బాధపడొద్దు.. ప్రతిసారి ఓకేలాగా ఫ్రెండ్‌షిఫ్‌ డేని సెలబ్రేట్‌ చేసుకోవాలని లేదు కదా.. ఈసారి సరికొత్తగా ప్లాన్ చేయండి. మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ మీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. షేర్‌చాట్ క్రియేటర్ కొన్ని ఐడియాలను షేర్ చేశారు. బెస్ట్ ఫ్రెండ్‌కు దూరంగా ఎన్ని మైళ్లు ఉన్నప్పటికీ.. ఫ్రెండ్‌షిప్‌ డే నాడు వాళ్లతో కలిసి ఎలా హ్యాపీగా ఉండాలో చెప్పారు. రేపే(ఆగస్టు 6) ఫ్రెండ్‌షిప్‌ డే(Friendship day) కావడంతో దూరంగా ఉన్న మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఇలా టైమ్‌ స్పెండ్‌ చేయండి..!

publive-image ప్రతీకాత్మక చిత్రం

వీడియో కాల్‌ల ద్వారా కలిసి వంట చేయండి:
వర్చువల్ కిచెన్‌లోకి అడుగు పెట్టండి. అంటే అర్థంకాలేదా..? వీడియో కాల్‌ల ద్వారా మీ ఫ్రెండ్‌తో కలిసి కుక్ చేయండి. ఇద్దరు కలిసి ఒకటే రెసిపితో వంట చేయండి.. వర్చువల్‌గానే కలిసి భోజనం చేయండి. లంచ్‌ టైమ్‌లో మీ పక్కనే మీ ఫ్రెండ్‌ ఉన్నట్టు అనుభూతి రావొచ్చు.

గేమ్:
ఇప్పుడంతా ఆన్‌లైన్ ప్రపంచం. చిన్నప్పటి నుంచి మీ ఫ్రెండ్‌తో కలిసి ఆడుకున్న చాలా ఘటనలు కళ్ల ముందు కదలాడొచ్చు. వాటిని తలుచుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. అదే సమయంలో ఆ రోజులు మళ్లి తిరిగి రావన్న బాధ కూడా వస్తుంది. ఆ జ్ఞాపకాలను తలచుకోని బాధపడకుండా ఆన్‌లైన్‌ ద్వారా ఫ్రెండ్‌తో కలిసి గేమ్‌ ఆడండి. బయట ఆడినంత సంతోషం కలగకున్నా.. కాసేపు ఫ్రెండ్‌తో సరదాగా ఆడమన్న ఫీలింగ్‌ వస్తుంది.

వాచ్ పార్టీ:
నెట్‌ఫ్లిక్స్ పార్టీ ఎక్స్‌టెన్షన్ ద్వారా మీ బెస్ట్‌ ఫ్రెండ్‌తో హాయిగా సినిమా రాత్రులను ఎంజాయ్‌ చేయండి. రియల్‌ టైమ్‌ చాటింగ్‌తో, మీరందరూ ఒకే సోఫాలో కూర్చొని సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలగవచ్చు. నిజానికి ఫ్రెండ్స్‌తో కలిసి.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తే వచ్చే ఆనందం ఇంకెవరితో వెళ్లినా రాదు. మీ ఫ్రెండ్‌ మీకు దూరంగా ఉంటుండడంతో ఇప్పుడు ఆ ఛాన్స్‌ లేకపోవచ్చు.. అయితే గతాన్ని గుర్తు చేసుకుంటూ ఇద్దరు కలిపి నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా సినిమా చూస్తూ రియల్‌ టైమ్‌ చాట్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు.

మెయిల్‌:
ఇప్పుడు లెటర్స్‌ కాలం పోయింది. అంతా మెయిల్‌ ద్వారానే ప్రతీది నడుస్తుంది. వర్క్‌ పర్పస్‌ నుంచి ఆఫీస్‌ విషయాల వరకు ప్రతీ విషయాన్ని మెయిల్‌లో షేర్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్‌ని హ్యాపీ చేసేందుకు మీ సొంతంగా కొన్ని కార్డ్స్‌ని డిజైన్ చేయండి. తనపై మీకున్న ఇష్టాన్ని చెప్పేలాగా గ్రీటింగ్‌ కార్డ్స్‌ని క్రియేట్ చేయవచ్చు. అవి మీ ఫ్రెండ్‌కి సెండ్‌ చేసి విషెస్‌ చెబితే ఎంతో థ్రిల్‌ ఫీల్ కావొచ్చు.

వర్చువల్ మీట్‌:
మీ స్నేహం గురించి మీ భావాలను వ్యక్తపరచడానికి దూరం మిమ్మల్ని అడ్డుకోదు. మీరు వేరుగా ఉన్నప్పటికీ, సోషల్‌మీడియాలో జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోను షేర్ చేసుకోవచ్చు. మంచి క్యాప్షన్‌తో ఆ వీడియోను షేర్ చేసుకోవడం ద్వారా గొప్ప అనుభూతిని కలుగుతుంది. ఇక వర్చువల్‌ మీటింగ్‌ని సెట్‌ చేసుకోండి. హ్యాపీగా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా గడపండి.

మీ ఫ్రెండ్‌ మీకు ఫిజికల్‌గానే దూరంగా ఉన్నట్టు లెక్క.. అంతేకానీ మీ మనసులు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయని మరిచిపోవద్దు..!

#happy-friendship-day #friendship-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe