Hair Re generation: హెయిర్‌ రీ జనరేషన్‌తో బట్టతలకు చెక్‌ పెట్టేదాం!

నేటి రోజుల్లో మారుతున్న కాలం వల్ల, పెరుగుతున్న కాలుష్యం వల్ల , నీటి మార్పిడి వల్ల తలలో చుండ్రు(Dendruff) బాగా పెరిగిపోయి, జుట్టు(Hair)  బాగా ఊడిపోతుంది.

New Update
Hair Re generation: హెయిర్‌  రీ జనరేషన్‌తో బట్టతలకు చెక్‌ పెట్టేదాం!

నేటి రోజుల్లో మారుతున్న కాలం వల్ల, పెరుగుతున్న కాలుష్యం వల్ల , నీటి మార్పిడి వల్ల తలలో చుండ్రు(Dendruff) బాగా పెరిగిపోయి, జుట్టు(Hair)  బాగా ఊడిపోతుంది. మరి కొంత మందికి తల మీద జుట్టులో ఇన్‌ ఫెక్షన్ వచ్చిందని చెబుతుంటారు. దీని వల్ల తల మీద జుట్టులో కొంత భాగం ఖాళీ అయిపోతుంది.

ఇలా ఇన్‌ ఫెక్షన్లు (Infection) వల్ల మాత్రమే కాదు..తల మీద ఎక్కడైనా గాయాలైన కూడా ఆ భాగంలో జుట్టు ఆ ప్రదేశంలో పెరగదు. ఆ గాయామైన భాగం అలాగే కనిపిస్తుంది. అయితే అలాంటి ప్రదేశంలో వెంట్రుకలు మొలిపించవచ్చు అంటున్నాయి కొన్ని పరిశోధనలు. జుట్టు ఊడిపోయి, బట్టతలతో బాధపడుతున్నవారికి తల మీద కొత్త వెంట్రుకలతో పాటు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి.

న్యూయార్క్‌ యూనివర్సిటీ పరిశోధకులు దీనికి పునాదులు వేశారు. చర్మం, వెంట్రుకల నిర్మాణంతో పాటు వాటి బలానికి కారణమయ్యే కొల్లాజన్‌ ను ఫైబ్రోబ్లాస్ట్‌ కణాలు తయారు చేసేందుకు వారు ముందుకు వచ్చారు. వీటి గురించి ముందు ఈ కణాల మీద ఎలుకల్లో స్టడీ జరిగింది.

గాయమైన చోట వెంట్రుకలు మళ్లీ పెరగడానికి ఒక జీవ ప్రక్రియ కారణమవుతుందని ఈ పరిశోధనలో తేలింది. తల మీద గాయాలు అయినపపుడు అక్కడ జీవక్రియ మందగిస్తుంది. అందువల్లనే ఆ భాగంలో వెంట్రుకలు తిరిగి రావు. అయితే ఈ జీవక్రియ చురుగ్గా ఉండేలా చేయగలిగితే ఫైబ్రోబ్లాస్ట్‌ కణాలు త్వరగా ప్రేరేపితం అవుతాయి.

తద్వారా వెంట్రుకల పునర్నిర్మాణం సాధ్యమవుతుందంటున్నారు పరిశోధకులు. ఎలుకల మీద చేసిన ఈ పరిశోధన విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేవు. ఈ పరిశోధన విజయవంతం కావడంతో నాలుగు వారాల్లోనే ఎలుకల్లో కొత్త వెంట్రుకలు ఏర్పడ్డాయి. ఈ రీసెర్చ్ మరింత ముందుకు సాగితే బట్టతలకు కూడా మంచి ట్రీట్ మెంట్స్ వచ్చే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు