Pimples: ఈ అలవాట్లు ఉంటే.. మొటిమలు మరింత పెరుగుతాయి

అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కునే సమస్య మొహం పై మొటిమలు. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, కాలుష్యం దీనికి కారమవుతాయి. ముఖ్యంగా ఈ అలవాట్లు మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. వాటిని గిల్లడం, హై మేకప్, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ సార్లు ఫేస్ వాష్, చెమటను రుద్దడం వంటి అలవాట్లు మానుకోవాలి.

New Update
Pimples: ఈ అలవాట్లు ఉంటే.. మొటిమలు మరింత పెరుగుతాయి

Pimples: అందం అమ్మాయిలకు ఒక ఆభరణము లాంటిది. ఎంత బిజీగా ఉన్న అందం పై మాత్రం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు అమ్మాయిలు. అయితే అమ్మాయిల అందానికి సంబంధించి సాధారణంగా అందరిలో కనిపించే సమస్య పింపుల్స్. ఆహారపు అలవాట్లు, కాలుష్యం , జీవన శైలి విధానాలు వీటి పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ అలవాట్లు మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి.

ఫాస్ట్ ఫుడ్స్

ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా మంచిది కాదు. అధిక ఆయిల్స్ మొటిమలను మరింత ఎక్కువ చేస్తాయి. అందుకే ఆయిల్ , ఫాస్ట్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి.

ఓవర్ మేకప్

ఎక్కువ మేకప్ వేయడం ద్వారా చర్మం రంద్రాలను మూసేస్తుంది. వాటిలో దుమ్ము , బ్యాక్టీరియా అలాగే ఉండిపోయి.. మొటిమలను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే చర్మంలోని సహజ నూనెలు కూడా తగ్గిపోతాయి.

ఎక్కువ సార్లు ఫేస్ వాష్

కొంత మంది మొహం శుభ్రంగా ఉండడానికి రోజుకు ఒక ఐదు, ఆరు సార్లు కడుగుతూ ఉంటారు. ఇలా చేస్తే సోప్ లో కెమికల్స్ కారణంగా చర్మంలోని తేమ, సహజ నూనెలు తొలగిపోయి మొటిమలు మరింత ఎక్కువవుతాయి.

publive-image

తరచూ గిల్లడం

మొహం పై పింపుల్స్ రాగానే.. చేయి పెట్టీ వాటిని గిల్లడం చేస్తుంటారు. ఇలా చేస్తే మొటిమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. గిల్లినప్పుడు వాటిలోని పస్ చుట్టు పక్కల స్ప్రెడ్ అవ్వడంతో మరిన్ని మొటిమలకు కారణమవుతుంది.

చెమటను రుద్దడం

చేమతగా ఉన్నప్పుడు కొంత మంది మొహమంతా రుద్దేస్తూ ఉంటారు. ఇలా చేస్తే దానిలోని దుమ్ము, బ్యాక్టీరియతో మొటిమల సమస్య ఎక్కువవుతుంది.

మేకప్ ప్రొడక్ట్స్

మేకప్ కోసం వాడే బృషెస్ శుభ్రంగా క్లీన్ చేసి వాడాలి. లేదంటే వాటిలో బ్యాక్టీరియ ఉండిపోయి.. నెక్స్ట్ టైం వాడినప్పుడు అవి చర్మలోకి వెళ్తాయి. దీని వల్ల మొటిమలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.

Also Read: Pre Heating Foods: ఈ ఆహారాలు వేడి చేసి తింటున్నారా..? అయితే జాగ్రత్త

Advertisment
Advertisment
తాజా కథనాలు