/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/TDP-50-jpg.webp)
Guntur: కార్యకర్తల సమావేశంలో నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి అరవిందబాబు కుమార్తె డాక్టర్ అమూల్య కన్నీరు పెట్టుకున్నారు. ఐదేళ్లుగా ప్రజల కోసం తన తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకుని అమూల్య ఎమోషనల్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా పేట ప్రజల కోసం పడిన శ్రమ కళ్లారా చూశానన్నారు. పిల్లల భవిష్యత్తుని సైతం పక్కన పెట్టి నియోజకవర్గ ప్రజల కోసం రాత్రింబవళ్లు తిరుగుతున్నారన్నారు. ఈ వయసులో ఇంత కష్టం అవసరమా అని చెప్పినా వినట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్ముకున్న ప్రజల్ని, కార్యకర్తల్ని వదిలేస్తే పట్టించుకునేదెవరని చెప్పారన్నారు.
Also Read: రోడ్డు ప్రమాదం.. సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి..!
ఐదేళ్లుగా ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని.. జీవితాంతం సంపాదించిన సొమ్మంతా రాజకీయాల కోసం దారబోసేశారని పేర్కొన్నారు. పిల్లల కంటే తన నియోజకవర్గ ప్రజలే ముఖ్యమని అరవింద బాబు చెప్పారన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి దోపిడీ సొమ్ముతో ప్రజల్ని కొనేస్తున్నా..ప్రజల కోసం తెగించి అరవింద బాబు పోరాడుతున్నారన్నారు. డబ్బు, రౌడీయిజంతో గోపిరెడ్డి రాజకీయం చేయాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు.
Follow Us